* అందుచేత ,అందువలన నేను అందరి పప్పులు ఉడికాయని భావించి సమాధానాలు
చెప్పేస్తున్నా .
౧.చాపట్లు = ఫింగర్ రోల్స్ = అట్టు లోపల కూర పెట్టి చాపలా చుట్టి,చిన్న ముక్కలు చేసి
నూనెలో వేయించే వంటకం
౨.గంగ నురుగులు = తెల్ల నువ్వులు/ + సగ్గుబియ్యం కలిపిన వడియాలు
౩.నీరొత్తిగలు = పేపర్ దోశలు /ఫేణీలు
౪.బజ్జులు = కూరగాయల్ని కాల్చి చేసిన పచ్చళ్ళు
౫.సారసత్తులు = జంతికలు
౬.ఇంచిమంచి = కాకా పట్టటం , లంచం ఇవ్వటం
౭.దూది మడుగులు = పూత రేకుల్లా మడిచి వండిన పూరీలను పాల కోవా లో ముంచి
తీసిన వంటకం, మాల్పువా -బెంగాలీ పేరు
౮.ఉక్కెర = చెక్కెర /బెల్లం చేర్చి నెయ్యిలో వేయించిన బియ్యపు పిండి వంటకం,
సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా
౯.కరిజ = ఖజ్జికాయ
౧౦.నూటిడి = రుబ్బిన తెల్ల నువ్వుల పిండిలో లేత కొబ్బరి, దంచిన బెల్లం ,వేయించిన
శనగపప్పు పిండి కలిపి చేసిన వంటకం
పైవన్నీ (ఇంచిమంచి కాక ) మన బాగా పాత తరాల తెలుగువారు చేసుకొని , లొట్టలు
వేసుకుంటూ ఆరగించిన అచ్చ తెలుగు వంటకాలు .కొన్ని శ్రీనాధుల వారి కవిత్వం లో
మనకు కనిపిస్తాయి .
మాట పోయింది నిజంగా. ఒక్కటి కూడా తెలియదు (తినటం కాదు, పదాలు) బలే మంచి పదాలు చెప్పేరండీ. ఏ ఏరియా లో వాడే పదాలో ఇవి?
రిప్లయితొలగించండినిజంగా ఇవి తెలుగేనాండీ? ఎక్కడా ఎప్పుడూ వినలేదు. ఇవి చెప్పినందుకు చాలా చాలా thanks!
రిప్లయితొలగించండిఎక్కడ సంపాదించారు గురువుగారూ ఇవన్నీ,great !