హెల్మెట్

*
ఓ పని లేని తెలుగు టీవీ ఛానల్ వారు ఓ పరమ బిజీ గా ఉన్న చౌరాస్తా లో నిలుచుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న సింగినాదం ను చుట్టుముట్టి ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు ,

" ఒక మనిషి గాడిద పై కూర్చొని వెళుతుంటే ,హెల్మెట్ లేనందుకు అతన్ని ఆపుతారా ? లేదా ? "

" లేదు " చెప్పాడు సింగినాదం

" ఎందుకు ఆపరు ? " అడిగారు పని లేని ఛానల్ వారు

" ఎందుకంటే , నాలుగు చక్రాల బండి కి హెల్మెట్ అక్కర లేదు "

8 కామెంట్‌లు:

 1. మీ బ్లాగు బాగుంది. కాని వత్తులు గట్రా జాగ్రతగా చూసుకోండి. ఆపరు బదులు మీరు ఆపారు అని వాడినారు. అయినా విషయం అర్ధమయ్యింది. నవ్వులు పూయించారు. ఇంకా ఇంకా మీరు వ్రాయాలి మీలో ని రచయిత. నేను విశాఖపట్నం లో భారతీయ జీవిత బీమా సంస్థలో డెవెలప్మెంట్ ఆఫీసరు గా చేస్తున్నాను. mrk495@gmail.com 9704014477

  రిప్లయితొలగించండి
 2. రాజేంద్ర గారు,

  అద్భుతమైన ఒరవడితో నడుస్తున్న హాస్యప్రవాహాన్ని ఆనందించండి. తప్పులు ఎంత గ్రంధమైనా తప్పవు. ఇక్కడ హాస్యం ప్రధానం, ఆనందం ప్రధానం అది అందిస్తున్న వారు, వారి రచన మనకు మహాప్రసాదం.

  మదను.

  రిప్లయితొలగించండి
 3. రాజేంద్ర గారు,

  అద్భుతమైన హాస్యప్రవాహాన్ని ఆనందించండి, ఇక్కడ హాస్యం ప్రధానం, ఆనందం ప్రధానం, తప్పులన్నవి వెతికితే ఎంత పెద్ద గ్రంధాలలో అయినా వస్తాయి. అధ్బుతమైన హాస్యాన్ని పారనివ్వండి, ఆ హాస్యం బీటలువారిన మనస్సులను చిగురింపచేయనియ్యాలి.

  మనసారా హాస్యాస్వాదన కోరుతూ

  మదను.

  రిప్లయితొలగించండి
 4. బాగుంది...నాకు కొత్తది.. చిరు నవ్వు వచ్చింది .

  రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం