ఈడు ఒక ఏడు,నవ్వులాట కు నేటికి

*
మా పక్కింటి కుర్రాడు సిగరెట్లు తాగటం మొదలుపెట్టి మొన్నటికి సంవత్సరమైంది.

వాళ్ల నాన్న మందులో మంచినీళ్ళు మానేసి నిన్నటికి సంవత్సరం .

వాళ్ల అమ్మ తెలుగు సీరియల్స్ చూడటం మానేసి,వాటిలో నటించటం మొదలు పెట్టి కూడా
సంవత్సరమైయ్యింది .

కేతి గాడి బ్లాగు "నవ్వులాట " మొదలయ్యి సంవత్సరం పూర్తి అయ్యింది .


నేడే ఈనాడే మొదటి పుట్టిన రోజు


అరరే,బాధ పడకండి ,వీడు మనల్ని సంవత్సరం నుండీ కుళ్ళు జోకులు రాసి విసిగిస్తున్నాడా
అని . బాధకి అలవాటు పడండి , ఇక ముందు కూడా నాకు రాయక తప్పదు , అంతగా బానిస
నయ్యాను .

ఇంతకీ నాకెందుకీ బ్లాగు రాయాలన్న దురద పుట్టింది ?

నేను అన్నప్రాసన నాడు , పుస్తకం మీద చెయ్యేసి అలాగే పడుకుండి పోయానట. మావాళ్ళు
నాకు బాగా చదువు వస్తుందని ఆనంద పడ్డారు.కానీ నేను ఎప్పుడు పుస్తకం పట్టుకొన్నా
నిద్ర వచ్చేస్తుంది .

అది చూసి మా అమ్మగారు ,నాకు ఒక మంచి సలహా ఇచ్చారు ,

"నాయనా , పుస్తకం పట్టుకొంటే నీకు ఎలాగూ నిద్ర వస్తుంది కాబట్టి , కుదిరినప్పుడల్లా కొత్త
పుస్తకం పట్టుకో , నిద్ర వస్తే తలకింద పెట్టుకొని పడుకో " అని

తల్లి మాటను జవదాటకుండా ఈనాటి దాకా కొత్త పుస్తకాలు చేత బట్టుకొని నిద్రలోకి జారి
పోతున్నాను .

అలా సుమారు 20 వేల పుస్తకాల వరకు నిద్ర కి వాడుకొని ఉంటాను .

తెలుగు కవిత్వం , మతం , తత్వ శాస్త్రం ,మనో వైజ్ఞానిక శాస్త్రం,హాస్యం ,నవలలు,వ్యక్తిత్వ వికాసం,
జ్యోతిషం ,తంత్ర శాస్త్రం , యోగం అన్నీ వాటిలో ఉన్నాయి .చివరికి బజ్జీల కొట్టువాడు పొట్లం
కట్టిన కాయితం కూడా వదిలిన వాడిని కాదు .

అంతలో మా అమ్మ ,ముందుగా ఒక్క మాటైనా చెప్పకుండా మబ్బుల్లోకి మొహం చాటేసింది,
మళ్ళీ కనిపించనంటూ మొండికేసి తిరిగి రాలేదు , మొన్న 8-మార్చ్ -2008 .

అప్పటి నుండీ మనసంతా నిండిన వెలితి , తెలియని ఖాళీ ,ఆలోచనల చిక్కు ముడులు ,
మనిషి జీవితం గురించి ఎంత పుస్తకాల తెలివిడి ఉన్నా ,ఏమీ తెలియని తనం
అనుభవం లోకి వచ్చిందపుడే .

కాలం, కొంత కాలానికి మనసుకి కాస్త వూరట నిచ్చింది .జీవితం కొద్ది ,కొద్దిగా తెలియటం
మొదలయ్యింది .

"ప్రతి మనిషి , ఆఖరికి మూర్ఖుడు కూడా చేసే ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉంటుంది .
ప్రయోజనం వారికి సంతోషాన్ని , ఆనందాన్ని ఇస్తుంది.కాబట్టి మనిషి పడే యాతన ,
దుఖం అన్నీ కూడా చివరికి వారికి ఎంతోకొంత స్వాంతనని, దాని ద్వారా పరిమితమైన
సంతోషాన్ని కలుగ చేస్తాయి . ఏడిస్తే మనసులో గూడు కట్టుకొన్న దిగులు కొంత పలచన
అవుతుంది కదా .అలాగే కొన్నిక్షణాలపాటు మనం నవ్వే నవ్వు , మన బాధలను దూరం
చేయలేక పోయినా కొద్ది క్షణాల పాటు మరపిస్తుంది "

భావంతో నా మనసు నిండి పోయింది.నా చుట్టూ ఉన్నవారిని కొద్ది క్షణాలైనా
సంతోషం గా ఉంచగలిగితే , నేను గానీ , వారు గానీ ఎప్పటికి ఇబ్బంది పడకుండా !

అలుపు రాని ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి ,అంతలో రెండు దీపాలు నాకు దారి
చూపించాయి . దీపాల పేర్లు "ఆంద్ర జ్యోతి , వల్లబోజు జ్యోతి " ,మే 2008 లో

వారు చూపిన బాటన కూడలి కొచ్చాను , జల్లెడ పట్టాను , 22-జులై -2008 .

అలా నా నవ్వులాట బ్లాగు మొదటి అడుగు వేసాను .

అడుగు లో అడుగు వేసుకొంటూ ఇక్కడకు చేరాను .

దొంగ వెధవ ఎవడు ? ,పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నాడు అని మీరు కూడా
నా వెనుక ఉండి , నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు .మొక్కుబడిగా రోజుకో జోకు రాసే నాకు
52000 హిట్లు నిచ్చారు .

అందుకు నేను సదా మీకు రుణపడి ఉన్నాను .

పయనం లో నా శ్రీమతి , నా పిల్లలు రోజూ నా జోకుల కధలు వోపిగ్గా వింటూ ,
నన్ను ఎంతో ఉత్సాహ పరిచారు .

నేనేదో పోటుగాడినని, జోకులు బాగా రాస్తానని , ఆంద్ర జ్యోతి వారు ఒకసారి మక్కీ కి మక్కీ
కాపీ కొట్టారు .మరోసారి నా బ్లాగు గురించి పొగుడుతూ రాసి నన్ను సంతోష పెట్టారు .

చివరాఖరికి చెప్పేదేమిటంటే ,

"నేనిలాగే జోకులు రాస్తూ ఉంటాను , మొహమాటానికైనా (సంవత్సరం పరిచయం మనది )
నవ్వుతూ , నాకు మీ అభిమానాన్ని , ఆశీస్సులను , అభినందనలను అందించండి ఎల్లపుడు "

ఇట్లు

మీ నవ్వులాట శ్రీకాంత్

19 కామెంట్‌లు:

 1. asalu mimmalani mechhukovali inni posts raasinaduku kaadu, daily oka post compulsary ga rastaru okka roju kuda miss kaaru very gr8. Happy Blogging.

  రిప్లయితొలగించండి
 2. I always enjoy your jokes, keep writing.

  --venkat

  రిప్లయితొలగించండి
 3. శ్రీకాంత్‌గారు

  మొదటి జన్మదిన శుభాకాంక్షలు (మీ బ్లాగుకి). మీ జోకులు కొన్ని తెలిసినవే అయినా, మీరు రాసే విధానం వల్ల మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఇలాగే అందర్నీ నవ్విస్తూ సెంచురీ కొడతారని ఆశిస్తూ....

  రిప్లయితొలగించండి
 4. బాధను మనసులో వుంచుకుని మీఅంత మీరు బాధపడకుండా పదిమందిని నవ్వించే పని మొదలెట్టి మీరూ నవ్వుకుంటూ సాగుతున్న నవ్వులాటలబండి
  పరుగులెత్తాలి పదికాలాలపాటు పదిమందికి నవ్వులు పంచాలి .

  రిప్లయితొలగించండి
 5. నిజం చెప్పాలంటే మీ అభిమానిని నేను చాలా జోకులు బాగా నవ్విస్తాయి ,అన్ని జోకులూ పేలకపోవచ్చు కాని ..ఇంతమందిని నవ్వించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం .. మీకు అభినందనలు,శుభాకాంక్షలు ,మీకు వాక్య రాయరేమో గాని ప్రతి ఒక్కరూ మీ బ్లాగ్ ఓపెన్ చేసి చదవకుండా ఉండలేరు ..

  రిప్లయితొలగించండి
 6. great work. i have enjoyed most of jokes.

  రిప్లయితొలగించండి
 7. మనస్సంతా భారంగా ,బాధగా ఉంది modati saari mee blog choosi !

  inni rojulu mee navvula vratham venaka, intha vishadam undanukoledu !

  mee blog veekshakullo nenu okadini !

  thank you for this hilarious blog ! please keep writing ! The joy, happiness and the laughter you spread may come to you thousand fold ! With best wishes ...

  రిప్లయితొలగించండి
 8. baaga vundandi..nenu max dec nundi daily mee blog visit chestunnanu.........

  chaala jokes baaguntay

  రిప్లయితొలగించండి
 9. మీ జొక్స్ చాలా బాగుంటాయి.... మీరు ఇలా మమ్మల్ని నవ్విస్తూ ఉండాలని కొరుకుంటున్నను.... నవ్వులాటకి జన్మదిన శుభకాంక్షలు...... :)

  రిప్లయితొలగించండి
 10. నవ్వులనావలొన
  కాలం కడలిపైన
  ప్రయణం చాల వెగంగా జరిగింది
  మీరు నిజమైన 'సారం'గులె

  శతమానం భవతి....

  రిప్లయితొలగించండి
 11. శ్రీకాంత్ గారూ,
  నేస్తం గారన్నట్టు వ్యాఖ్య రాసినా రాయకపోయినా మీ బ్లాగు చూసే బోలెడంతమందిలో నేను కూడా ఉన్నాను.
  ప్రతీరోజూ క్రమం తప్పక మమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేసే మీరు నిజంగా అభినందనీయులు.
  బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే మీరు పది కాలాలపాటు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని నా కోరిక.
  హృదయపూర్వక అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. జోక్స్ లో ఉండే రోటీన్ హాస్యం నన్నువాటికి దూరం చేశాయి. నేను కోరుకొన్న కొత్తదనం చూపించి మళ్లీ దగ్గరచేశారు.

  రిప్లయితొలగించండి
 13. అప్పుడే సంవత్సరం వచ్చేసిందా? మొన్నేగా నవ్వడం మొదలెట్టాము. అయినా నవ్వుకు వయసేంటండండి, మనసుండాలి కాని. నవ్వూ నవ్వించూ అనే సూక్తిని అధారం చేసుకొని మీరు రాసే నవ్వులాటకి నేను కూడా ప్రతి రోజు హాజరు వేయించేసుకొని ఓఅ ఆట (నవ్వు) ఆడేసి వెళ్తూ ఉంటాను.

  అమ్మగారికి ఆత్మశాంతి కలగాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ....

  మీ మా మన నవ్వులాట కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 14. అమ్మలారా ,అయ్యలారా,

  నా పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి కోటి నెనర్లు.మీ అండతో ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను .

  మీ ఆశీస్సులు నాకందించండి

  రిప్లయితొలగించండి
 15. అమ్మగారెక్కడికీ పోలేదు. మీరన్న ఆ 52000 హిట్లల్లో లక్షల నవ్వుల్లో కనపడుతూనే వుంటారు.
  రెగ్యులర్ గా కామెంటకపోయినా, నాలాంటి మీ పాఠకులు వేలల్లోనే

  రిప్లయితొలగించండి
 16. abba mana telugu vallu intha manchi pani chesthunnru ani telisi chala santhosham and garvamga undi. continue cheyyandi. na subhakankhalu.

  -Raheem Baig (Hyderabad)

  రిప్లయితొలగించండి
 17. srikanth garu meeru intha badalo kuda maaaku navvuni andistunnaru hatsof u sir...........

  రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం