లాయర్ సంపాదన

ఇద్దరు లాయర్లు కోర్టు క్యాంటిన్ లో టీ తాగుతూ మాట్లాడు కొంటున్నారు .

"రామూ ! నీ మొదటి సంపాదన ఎంత ? "

" ముష్టి ఐదువేలు ,మా సీనియర్ పార్టీ దగ్గర పాతిక వేలు నొక్కేసి ,నాకు ఐదు వేలు పడేసాడు .
మరి నీకురా చలపతీ ? "

" నేను నా మొదటి కేసు తో, నా మేనమామ దగ్గర చదువు కోసం తీసుకొన్న లక్ష బాకీ తీర్చేసాను "

" మొదటి కేసే గొప్పది కొట్టేసావు ,ఆ కేసు గురించి చెప్పరా "

" అప్పు తీర్చలేదని మామయ్య నా మీద కేసు వేసాడు ,దాంతో మొత్తం కట్టాల్సివచ్చింది "

4 కామెంట్‌లు:

  1. జోకు చాలా బాగుంది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  2. హ హ హ. లాయర్నే తలదన్నిన ఆ మేనమామకి జోహార్లు!

    బైదవే, వెల్కం బాక్. మీ నవ్వుల పువ్వులు విరబూయక బ్లాగ్తోట చిన్నబోయింది ఇన్నాళ్ళూ

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం