విడాకుల కోసంతొమ్మిదేళ్ళ కాపురం బోర్ కొట్టి కుచేల రా వు , సంతానలక్ష్మి విడాకుల కోసం కోర్ట్ కెక్కారు .

జడ్జి : "మీకు విడాకులు ఇస్తాం, కాని మీతొమ్మిది మంది పిల్లల భారం ఇద్దరూ సమానంగా
చూసుకోవాలి ."

"పదవేలక్ష్మీ ! పది నేలలాగి వద్దాం " అన్నాడు కుచేల రా వు వెంటనే భార్యకు కన్ను గీటి .

ప్రేమ పెళ్లిరజియా , రాబర్ట్ ప్రేమించుకొని పెళ్లికి రెడీ అయ్యారు.

ఫ్రెండ్స్ అందరికి శుభలేఖలు అందాయి .

పెళ్లి రోజు , ఫ్రెండ్స్ తలలు పట్టుకుని కూర్చున్నారు "ఎవరి పెళ్లి కి వెళ్ళాలో తెలియక "

నిజం ప్రేమరాణి : "మన ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే చచ్చిపోదాం రాజు "

"మా ఆవిడ విధవ కావటం నా కిష్టం లేదు " అనేసి నాలిక కరుచుకున్నాడు రాజు

ఇంటి వంట"వంట చేస్తున్నావేంటి బావా ? , ఏ హోటల్ లో చూసినా నువ్వు, అక్క కనిపిస్తారుగా రోజూ !"

"మీ అక్క ఊరు వెళ్లిందిరా రాజు " అన్నాడు లక్ష్మీపతి .

అరిచే కుక్క


రాము , కిరణ్ సన్నని సందు గుండా వెళుతున్నారు .
అటువేపునుండి కుక్క ఒకటి గట్టిగా మొరుగుతూ వీళ్ళ వైపు వస్తోంది .

కిరణ్ భయపడి వెనక్కి అడుగేసాడు .

"భయపడతావేంటి, అరిచే కుక్క కరవదు అని తెలీదా ?' అన్నాడు రాము.

"తెలుసు , కాని కుక్క మొరగటం ఆపి ఎప్పుడు కరవటం మొదలు పెడుతుందో తెలీదు కదా !"
అన్నాడు భయం భయం గా కుక్క వంక చూస్తూ కిరణ్

అమర ప్రేమికులు


కావ్య , కిరణ్ ప్రేమ కోసం చనిపోవలనుకున్నారు .

కిరణ్ కొండ ఫై నుండి ముందుగా దూకేసాడు .

"ప్రేమ గుడ్డిది " అనుకుంటూ , ఒక్క క్షణం కిందకు చూసి ,
వెనుతిరిగింది కావ్య .

"ప్రేమకు చావు లేదు " అంటూ కిరణ్ పేరాచుట్ తెరిచాడు !

ప్రేమ చావు


"రాధా , నువ్వు నా ప్రేమను కాదంటే చచ్చిపోతాను " అన్నాడు కృష్ణ .

కృష్ణ చచ్చిపోయాడు.


తన ఎనభయ్యో ఏట

భార్య అందం


అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు అప్పారావు
తలుపు తీసింది భార్య

"ఆండాళ్ళు , నువ్వు చాలా మంచిదానివే , చాలా
అందంగా కనిపిస్తున్నావు , బ్యూటీ పార్లర్కు వె ళ్ళేవా ?"

"మళ్ళీ ఈ రోజు కూడా తప్పతాగావా ,చచ్చినోడా !"

మగువ మనసుమగవాడు స్త్రీని అర్ధం చేసుకోవటంలో తన
జీవితంలో రెండు సార్లు పొరపాట్లు చేస్తాడు


మొదటిసారి పెళ్ళికి ముందు ,

మరి రెండవసారి ?

పెళ్ళికి తరువాత

అసలు కారణం


హరిత కాలేజీకి మొదటిసారి లేట్ గా వెళ్ళింది .

లెక్చరర్ : ఎందుకు ఆలస్యం అయ్యింది ?

హరిత : ఆ పోకిరి కిరణ్ నా వెంట పడ్డాడు మేడం !

లెక్చరర్ : అయితే ?

హరిత : వాడు చాలా నెమ్మదిగా నడుస్తున్నాడు మేడం !

మీ చిరునవ్వుల కోసం ఈ బ్లాగ్ అంకితం .రోజుకో జోక్ బ్లాగడానికి ప్రయత్నిస్తా