దురద సూత్రములు

౧. దురద పుట్టిన చోటే గోక్కోవాలి

౨. దురద పుట్టినపుడే గోక్కోవాలి

౩. గోక్కున్న చోట మళ్ళీ దురద పుడుతుంది

ఇవి బ్లాగు రాతలకు వర్తిస్తాయి ,షేర్లకు వర్తిస్తాయి ,జీవితం లోని అన్నింటికి వర్తిస్తాయి .
నాకు తెలుగు బ్లాగులను చూసిన తరువాత తెలుగులో జోకులు రాయాలని దురద పుట్టింది.
అదీ బ్లాగుల్లోనే రాయాలని పించింది . బాగా గోక్కున్నాను ,ఒక సంవత్సరం ఆపకుండా రాసి
ఒక రికార్డ్ తయారు చేసుకొన్నాను .ఒకసారి ఆగి చూసుకున్నాను,ఈ నెల మొదట్లో.నా జోకులు
రాశి ( శిరా ని తిరగేస్తే వస్తుంది .శిరా ఎక్కువ వాడితే రాశి పెరుగుతుంది ) లో ఎక్కువా ?,
వాసి (వాసనకి దగ్గరగా ఉండే పదం) కూడా ఉందా అని అనుమానం వచ్చింది .సరే ,
ఆచరణ లో చూస్తే పోలా అని అనిపించి నాలుగవ తారీఖునుండీ దూరంగా ఉండిపోయాను.
ఏమో మరి మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతానో ,దైవాధీనం నవ్వులాట ...........................

2 కామెంట్‌లు:

  1. mee meeda kesu vesthunnanu ... meeru rayatam apinanduku .... ;-)

    రిప్లయితొలగించండి
  2. అయ్యో. ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి సర్. మీరు రాయకపోవడంతో బిజీగా ఉన్నారేమోనని అనుకున్నా. రోజూ కాకపోయినా వారానికి రెండు మూడు సార్లయినా జోకులు పేలుస్తుండండి.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం