బ్లో అవుట్

*
గోదావరి బేసిన్ లో ఓ.యన్.జీ.సి వారు సహజవాయువు కోసం,ముమ్మరంగా తవ్వకాలు
చేపట్టారు. అదృష్టం కొద్దీ రెండు బావులు కనుక్కొన్నారు.ఆనందం తో హ్యాపీ గా నిద్ర పోయారు .

అర్ధరాత్రి , ఏమైందో తెలియదు , ఒక గ్యాస్ బావి నుండీ మంటలు లేచాయి ,గాలి తోడయ్యింది ,
అలలు అలలు గా ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లు క్షణ క్షణానికి పెరిగిపోతున్నాయి .

అందరూ మేల్కొన్నారు , అయోమయం వదిలారు ,మంటలు ఆర్పటానికి తమదగ్గరున్న
అధునాతన పరికరాలన్నీ తెచ్చారు ,గాలన్లకొద్దీ గోదావరి నీటిని పైపుల్లోకి ఎక్కించారు .
కానీ , ఎంత ప్రయత్నించినా,బావికి కనీసం అర కిలో మీటర్ దగ్గరకు కూడా వెళ్ళలేక పోయారు.

తలలు పట్టుకున్నారు , మంటలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి .చివరికి ఉళ్ళో ఉన్న
కొంపలార్పే వాళ్ళకి (fire station ) కబురు చేసారు , చివరి ప్రయత్నంగా .

కొద్ది క్షణాలలో , గణ గణ మని గంటలు కొట్టుకుంటూ వాళ్ళ వాహనం రానే వచ్చింది ,
ముందుకు దూసుకు పోయింది . బావికి వంద అడుగుల దూరం లో ఆగింది.

చక చకా వేల గాలన్ల నీళ్లు పంప్ చేసారు . నాలుగు గంటలు కష్టపడి మంటలు అదుపు
లోకి తెచ్చారు .

అధికారులు విస్మయం చెందారు .తమ ఆధునిక పరికరాలు చేయలేని పని , మామూలు
ఫైర్ ఇంజన్ తో జరగటంతో .తేరుకొని మనసారా వారిని అభినందించారు .


పురస్కారం గా ఈ పని లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పది వేల రూపాయల నగదు వెంటనే
అందచేసారు .

తరువాత అందరు కలిసి టీ తాగుతుండగా , ఓ.యాన్.జీ.సి ఆఫీసర్ అడిగారు , ఫైర్ స్టేషన్
సిబ్బందిని ,

" మీరు ఈ పది వేల తో ఏం చేస్తారు ? "

" వెంటనే బండి బ్రేకులు బాగు చేయిస్తానండీ " చెప్పాడు ఫైర్ ఇంజన్ డ్రైవర్

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం