*
హరి వాళ్ల నాన్న తో కలిసి , ఓ రోజు సాయంత్రం వంతెన పై నడిచి వెళుతున్నాడు .ఇంతలో
వర్షం కురవటం మొదలు పెట్టింది . పడుతున్న వాన ని చూస్తూ హరి అడిగాడు ,
" నాన్నా , మబ్బులు ఎలా వస్తాయి ? "
" ఏమోరా , నాకు తెలీదు "
ఒక నిమిషం ఆగి హరి మళ్ళీ ప్రశ్నించాడు ,
" ఆకాశం ఎందుకు నీలం గా ఉంది "
" ఏమోరా , నాకు తెలీదు "
" ఎవరూ పట్టుకోకుండా ఆకాశం లో మబ్బులు కింద ఎందుకు పడట్లేదు ? "
" నాకు తెలీదు " కొద్ది విసుగ్గా చెప్పాడు నాన్న .
" ఇంద్ర ధనుస్సు లో ఏడు రంగులు ఎందుకు ఉంటాయి "
" నాకు తెలీదు అని చెప్పానా " విసుగు పెరిగింది తండ్రికి.
గమనించిన హరి మొహం చిన్న బోయింది .తండ్రి తో అన్నాడు నెమ్మదిగా ,
" నాన్నా , నా ప్రశ్నలతో మీకు విసుగు పుడుతోందా ? "
తండ్రి హరి ని దగ్గరకు తీసుకొని చెప్పాడు అనునయంగా ,
" లేదురా కన్నా , ఏ ప్రశ్నలు వేయకుండా నువ్వు జ్ఞానం ఎలా పెంచుకోగలవు,నువ్వు
ప్రశ్నలు అడగటం ఎప్పుడూ మానకు "
LOL
రిప్లయితొలగించండి