నిజ నిర్ధారణ

*
మహాలక్ష్మీ బ్యాంక్ మేనేజర్ సదానంద్ కోపంగా గోడ గడియారం వంక చూస్తున్నాడు .
ఖర్మ కాలి హెడ్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ , ఆడిట్ వాళ్లు ఒక్క సారే వొచ్చారు . కానీ ఏకాంబరం ,
నీలకంఠం మాత్రం పదిన్నార అయినా , ఇంతవరకు వచ్చి చావలేదు .

ఏకాంబరం , నీలకంఠం ఒకే కాలనీ లో ఉంటారు .నిన్న రాత్రి యెక్కిన గుర్రం ,పొద్దున్న
పదింటి దాకా దిగలేక పోయారు .అప్పుడే లేచి తొందరగా తయారై , ఏకాంబరం డొక్కు కారు
మీద బ్యాంక్ కి బయలుదేరారు .పది గంటల నలభై నిమిషాలకు జేరారు

మేనేజర్ వాళ్ళని , తన కాబిన్ లోకి పిలిచి అడిగాడు ,

" మీకు బుద్ది ఉందా , లేదా ?, ఇంత లేటు ఏంటి ? "

ఇద్దరూ ఒకే గొంతు తో చెప్పారు ,

" కారు టైరు పంచర్ అయ్యింది సార్ "

అది విని సదానంద్ కోపం నసాళానికి ఎక్కింది .అయినా తమాఇంచుకొని, ఏకాంబరం ని
పార్కింగ్ ప్లేస్ కి తీసుకెళ్ళి అడిగాడు ,

" నిజం చెప్పు , కారుకి టైర్ కి పంచర్ అయ్యిందో ,ఇదే ప్రశ్న వాణ్ని కూడా అడుగుతాను ,
తేడా వచ్చిందో ఇద్దరినీ డిస్మిస్ చేసి పారేస్తాను "

1 కామెంట్‌:

  1. మనసు చికాకుగా వుంటే హాయిగా నవ్వుకోడానికి మీ బ్లాగులో కాసేపు కాలక్షేపం చేస్తుంటాను...నిజం! నవ్వులాట కాదు!!

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం