మహాభారత యుద్దానికి కొద్ది రోజుల ముందు ,
హనుమంతుడు,భీముడు రాబోయే యుద్దాన్నిగురించి చర్చించుకొంటూ ఓ అడవిలో నడుస్తూ
ముందుకు వెళుతున్నారు .అంతలో వారికి ఒక సొరంగం లాంటి లోతైన గుంట కనిపించింది.
ఇద్దరు లోపలికి తొంగి చూసారు , లోతు తెలీలేదు .భీముడి మనసులో లక్క ఇల్లు అంటుకున్న
నాటి సొరంగ యానం గుర్తొచ్చింది .అంతు చూడాలను కొన్నాడు .
హనుమంతునికి కపి సహజమైన కుతూహలం పెరిగింది .
ఓ నాలుగు గులక రాళ్ళు ఏరి ఆ గుంటలో వేసారు .అసలు శబ్దమే లేదు .ఓ ఆరు చిన్న
రాళ్ళు విసిరారు . చిన్న శబ్దం కూడా రాలేదు . రెండు బండరాళ్ళు విసిరారు . ఏమీ ప్రయోజనం
లేదు . లాభం లేదని పెద్ద కొండ రాళ్ళను దొర్లించారు. అయినా ఫలితం సున్నా .
రెండు చెట్టు కొమ్మలని విరిచి వేసారు .ఉపయోగం లేదు . ముప్పై అడుగుల తాడి చెట్లను
పీకి దాంట్లో వేసారు . పరిస్థితి లో మార్పు లేదు .
ఇక లాభం లేదు అని ఇంకా పెద్ద చెట్ల కోసం వెతకటం మొదలు పెట్టారు. వారికి దగ్గరలో
ఓ 200 అడుగుల ఎత్తు ఉన్న మర్రి చెట్టు మాను కనిపించింది .
ఒకటి చేతి లోకి తీసుకొని సొరంగం లోకి విసిరారు అవలీలగా ,ఏమన్నా ఉపయోగం ఉందా
అని లోపలికి తొంగి చూస్తున్నారు .
ఇంతలో హటాత్తుగా ఓ ఏనుగు భయంకరంగా ఘీంకరిస్తూ ,ఇరవై అడుగుల దూరం నుండీ
వీళ్ళ వైపు సుడిగాలిలా విపరీతమైన వేగంతో దూసుకొచ్చి సొరంగం లో పడిపోయింది .
ఇద్దరికీ ఏమీ అర్ధం కాక అలా చూస్తుండి పోయారు .
కొద్ది క్షణాల తరువాత , అక్కడకు ఘటోత్కచుడు ఏదో వెతుక్కుంటూ వచ్చాడు ,
భీముని అడిగాడు ,
" నాన్నగారూ ! నేను మచ్చిక చేస్తున్న అడవి ఏనుగు ఒకటి కనిపించటం లేదు,
మీరు చూసారా ? "
"అదో కాదో మాకు తెలీదు , కానీ ఇప్పుడే ఒక ఏనుగు పిచ్చి పట్టినట్లు పరిగెత్తి వచ్చి
ఈ గుంటలో పడి పోయింది " చెప్పాడు భీముడు
"ఐతే అది కాదు నాన్న గారు,నేను నా దాన్నిఓ రెండొందల అడుగుల మర్రి మానుకి కట్టేసాను "
అంటూ ఏనుగుని వెతుక్కుంటూ వెళ్లి పోయాడు ఘటోత్కచుడు .
ha ha ha
రిప్లయితొలగించండిbaagundandi
రిప్లయితొలగించండి