*
రమేష్ , రాధ పెళ్లి చేసుకొని మూడు ఏళ్ళు అయ్యింది .మొదటి ఏడాది రమేష్ మాట,రాధ వింది.
రెండో ఏడాది రాధ మాట రమేష్ విన్నాడు . మూడో ఏడాది ఇద్దరి అరుపులు చుట్టూ ఉన్నవారు
విన్నారు .ఒకరోజు మూడేళ్ళ తరువాత కలసిన మిత్రుడు శంకరరావు అడిగాడు ,
" ప్రేమించి చేసుకున్నావు కదా , కాపురం ఎలా ఉంది ? "
" ఏవో చిన్న గొడవలు రోజూ ఉన్నా , మా ఇద్దరికి ఒక విషయం లో ఏకాభిప్రాయం కుదిరింది "
" ఏమిటది ? "
" ఒకరినొకరు ద్వేషించే విషయం లో "
హహ్హాహ్హ్హహహ ఎంత అండర్ స్టాండింగ్ ఇద్దరి మధ్య.. సుపర్బ్ బార్యభర్తలంటే అలా ఉండాలి.
రిప్లయితొలగించండి