*
అనగనగా ఒక అడవి , అందులో వయసులో ఉన్న చిరుత ,దానికి బోరు కొట్టింది .పక్కనున్న
పల్లె కి షికారు వెళ్ళింది .రెండు గొర్రెలు ,ఒక లేగ దూడ , నాలుగు మేకలు ఓ వారం తిండి కి
సరిపోయాయి.
ఎవరో మిమిక్రి ఆర్టిస్ట్ మేకలా అరుస్తుంటే , నిజమే ననుకొని ఓ ఇంట్లో దూరింది .అటక
పైకెక్కింది.
అటవీ శాఖ వారు వచ్చి , ఒడుపుగా వల వేసి పట్టుకొని , దగ్గరలోని జంతు ప్రదర్శనశాలకి
బహుమతి ఇచ్చారు .
చిరుతని ఒక బోనులో ఉంచారు . దాని పక్క బోనులో ఓ ముసలి చిరుత ఉంది.తనకు జతగా
మరో చిరుత బోనులో ఉన్నందుకు కొత్త దానికి సంతోషం కలిగింది.మాటలు కలిపింది .
అలా వారం గడిచింది , కొత్త చిరుత , ముసలి చిరుత ని అడిగింది ,
" వారం నుండీ చూస్తున్నాను , ఆ మనిషి గాడు నీకేమో మాంసం పెట్టి , నాకు అరిటి పళ్ళు
ఇస్తున్నాడేమిటి తినటానికి ? "
" ఇక్కడి సంగతి నీకు తెలీదు .మొన్న వచ్చిన ఆర్ధిక మాంద్యం వల్ల ఈ సంవత్సరం బడ్జెట్
లో కొత్త పులుల కి కేటాయింపులు లేవు . నిన్ను కోతుల ఖాతాలో లోపలికి తెచ్చారు "
:)
రిప్లయితొలగించండిజూ లో జంతువులకి కూడా ఆర్ధిక మాంద్యం :)
రిప్లయితొలగించండిచాల బావుంది..
:)
రిప్లయితొలగించండిHahahaha
రిప్లయితొలగించండిchala bagundi :)
రిప్లయితొలగించండి