*
అలవాటుగా ఓ ఆర్.టీ.సి. బస్సు నదిలో పడిపోయింది .అదృష్టంకొద్దీ నదిలో నీరు మొదటి
ప్రమాద హెచ్చరిక కు కొద్ది దిగువగా ఉంది .వేగం కూడా ఎక్కువ లేదు .
గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగారు .ఒక్కొక్కరిని రక్షించి ఒడ్డుకి చేరుస్తున్నారు.
అలా పైకి చేరిన ధనకుమార్,మళ్ళీ వెంటనే నదిలోకి దూకేసాడు.పక్కనున్న స్నేహితుడు,
ఎదురుగా ఉన్న శిరీష్ ని అడిగాడు
"ఏరా ! ధన్ గాడు మళ్ళీ నదిలోకి దూకాడు ఎందుకు ? "
" బస్సు కండక్టర్ వీడికి రెండు రూపాయలు చిల్లర బాకీ పడ్డాడు , వసూలు చేసుకోవటానికి "
వీరికి కొద్ది దూరం లో ,
ఓ గజ ఈతగాడు , అప్పుడే ఒడ్డు కొచ్చి అలుపు తీర్చుకొంటున్నాడు.ఇంతలో ఒకామె ,
" ఈ నా పిల్లాడిని ఒడ్డుకి తెచ్చింది నీవేనా ? " అని అడిగింది
" అవును " అన్నాడు అతను
" అయితే వీడి జేబులో రెండు ఎక్లైర్స్ చాక్లెట్లు ఉండాలి , వాటిని ఏం చేసావ్ ,పిల్లాడి
చాక్లెట్లు తినటానికి సిగ్గు లేదూ " విరుచుకు పడింది ఆమె
ఇక నదిలో ,
ధన్ కుమార్ తన ముందున్న కండక్టర్ ని పట్టుకోవటానికి వేగంగా ఈదుతూ కేక
పెడుతున్నాడు ,
"కండక్టర్ , నువ్వు నాకు చిల్లర రెండు రూపాయలు ఇవ్వకుండా తప్పించుకో లేవు "
కండక్టర్ తన ముందున్న ఓ ప్రయాణికుని వేపు వేగం గా ఈదుతూ అరుస్తున్నాడు ,
"ఏమండీ , బస్సు వంతెన ఎక్కే ముందు ఎక్కి టికట్ తీసుకోకుండా ఎక్కడికి వెళతారు ? ,
టిక్కెట్ కొట్టేశాను , డబ్బులిచ్చి వెళ్ళండి " అంటూ
చాలా బాగుంది ..
రిప్లయితొలగించండిచిల్లర నవ్వులు ఎమిటిబాబు
రిప్లయితొలగించండిGreat ....
రిప్లయితొలగించండి:))
రిప్లయితొలగించండిబాగుందండి...
రిప్లయితొలగించండిఎవరి గోల వారిది..!!
-శ్రీ
Just for CHANGE
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండి