*
రాత్రి పది గంటలు దాటింది .తన మిఠాయి దుకాణం మూసేసి ఇంటికెళ్ళటానికి తయారయ్యాడు
గురవయ్య .
ఇంతలో వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ చిన్నిపాప ,ఆవెనకే ఆమె తల్లి దుకాణం లోకి అడుగు పెట్టారు .
తల్లి అడిగింది ,
" మిఠాయి ఉందా ? "
గురవయ్య ఒక్క క్షణం ఆగాడు ,ఆలోచిస్తూ .ఇవాళ పొద్దున్న తన ముసలి తల్లి అడిగింది ,
వచ్చేటప్పుడు కొద్దిగా మిఠాయి తెమ్మని . తన మనవరాలు కూడా "నాతూ " అంది .ఇప్పుడు
అంతా అమ్ముడు పోగా , ఓ చిన్న అచ్చు మిగిలింది . అమ్మాలా ? , ఇంటికి తీసుకెళ్ళాలా ?
ఇంతలో పిల్ల ఏడుపు శృతి పెంచింది.తల్లి అరిచింది ,
"ఓ రూపాయి ఎక్కువ తీసుకొన్నా పరవాలేదు ,దీని ఏడుపు భరించలేక చస్తున్నా .ముందు
ఇవ్వు ".
గురవయ్య నెత్తికి డబ్బు ఎక్కింది .తన దగ్గరున్నది , తీసి తూకం వేసాడు .పావు
కిలో ఉంది .తల్లి అంది
" ఇంకాస్త పెద్దది ఉంటే చూడు "
ఆమెను కబుర్లలో పెట్టి గురవయ్య , మిఠాయి ని లోపల పెట్టి , మళ్ళీ అదే అచ్చుని బయటకు
తీసాడు .దాన్ని త్రాసులో పెట్టి బొటనవేలితో కనపడకుండా నొక్కి ఉంచాడు . ఈసారి తూకం
నాలుగు వందల గ్రాములుంది .
వచ్చినామే తల పంకించి ,
" సరే ,ఈ ముక్క , చిన్నముక్క రెండు కలిపి ఇవ్వు ,దీని ఏడుపు చూడలేక చస్తున్నా "
అని , డబ్బులు బయటకు తీసింది .
artham kaledu joke
రిప్లయితొలగించండిVunnadi okate achchu rendu ekkadanunchi testadu.Guravaiah baga irukkupoyadui.
రిప్లయితొలగించండిHahaha
nice
రిప్లయితొలగించండి