బరువు

*
విజ్ఞేశ్వరరావు , అమలని పెళ్లి చేసుకొని ఆరు నెలలయ్యింది .పెళ్ళైతే తిరుపతి వస్తానన్న మొక్కు
తీర్చటం కోసం , రైల్వే స్టేషన్ లోకి అడుగు పెట్టాడు .

ఎదురుగా మెరుస్తూ , వెలుగుతూ ఉన్న బరువు , అదృష్టం చూసుకొనే యంత్రం కనిపించింది .
తన బరువు తగ్గిందేమో చూడటానికి మిషను ఎక్కి రెండు రూపాయలు దాంట్లో వేసాడు .

బరువు కార్డ్ బయటకొచ్చింది ,చూసాడు , భార్య తో చెప్పాడు ,

"చూడు , నేను ధైర్యవంతుడిని అని , బాగా సరదాగా ఉంటానని , భార్యని ఎంతో ఇష్టం గా
చూసుకొంటానని రాసాడు "

అమల కార్డ్ చేతిలోకి తీసుకొని , చూసి అంది ,

" మీ బరువు కూడా తప్పు గా వచ్చింది , చూసారా ? "

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం