*
కోటీశ్వరుడు కుచేలరావు ఇంట్లో గొప్ప విందు జరుగుతోంది. పేరున్న గాయనీ గాయకులు తమ
సుమధురగానం తో శ్రోతలకు శ్రవణానందం కలిగించారు .ఇంతలో కుచేలరావుగారి అమ్మాయి
శ్రీలేఖ ని పాడమని బలవంత పెట్టారు కొందరు శ్రోతలు .
ఆమె ముందు, నేను పాడలేను, నాకు అంతగా రాదు అంది.పాడాలి అన్న వన్స్ మోర్ లతో
గానం మొదలయ్యింది .ఓ అరగంట సాగింది .
ఓ ఐదు నిమిషాలు సభాస్థలి చప్పట్లతో మార్మోగింది.
ఆమె వినయంతో గర్వంగా చెప్పింది " నేను సంగీతం నేర్చుకోవటం కోసం పది లక్షలు ఖర్చు
పెట్టాను "
ఒక్కొక్కరూ వచ్చి ఆమెని అభినందించ సాగారు , డాక్టర్ కిషోర్ కుమార్ ,ఆమెతో కరచాలనం
చేసి అన్నారు ,
" అమ్మాయీ, మీరు ఒక్క సారి మా తమ్ముడిని కలవండి ,మీకు మంచి జరుగుతుంది "
" ఆయన గాయకులా లేక కచేరీలు ఏర్పాటు చేస్తుంటారా " అడిగింది ఆసక్తిగా శ్రీలేఖ
" లేదమ్మా , వాడు లాయరు , మీరు ఖర్చు పెట్టిన సొమ్ము వాపసు ఇప్పిస్తాడు "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం