ఎదురుగా ఎలుగుబంటి

*

స్కూల్ పిల్లలకు నెహ్రూ జులాజికల్ పార్క్ లో రకరకాల జంతువులను చూపిస్తున్నాడు గైడ్
గోవిందం

నాలుగో తరగతి కుర్రవాడు గోవిందాన్ని అడిగాడు ,

"అంకుల్ ,ఎప్పుడైనా అడవి జంతువులు మీకు ఎదురుగా వచ్చి ,మీరు భయపడటం జరిగిందా? "


"
జరిగింది ఐదుఏళ్ల క్రితం ఒక ఎలుగుబంటి నాకు సరిగ్గా ఐదు అడుగుల దూరంలో , నన్ను
గుర్రుగా చూస్తూ నిలబడింది .నాకు చాలా భయం వేసింది .ఒక్క క్షణం తరువాత నాదగ్గరికి
కోపం గా అరుస్తూ ముందుకు అడుగు వేసింది . ఏం చేయాలో నాకు తోచలేదు . ఇంతలో
మరింత దగ్గరగా వచ్చేసింది " అని ఒక్క క్షణం ఆగాడు గోవిందం సంఘటన గుర్తు చేసుకొంటూ .

పిల్లలు వెంటనే ,

" ఆపకండి , చెప్పండి అంకుల్ , తరువాత ఏం జరిగింది ? " అని ఉత్సుకత తో అడిగారు

" వెంటనే నా బుర్ర దేవుడి దయవల్ల పనిచేసింది ,వేగంగా నడుచుకుంటూ పక్కనున్న బోను
దగ్గరకు వెళ్లి పోయాను " ముగింపు నిచ్చాడు గోవిందం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం