నమ్మకం

*
వీరయ్య , ప్రజాపతి రావు తో అన్నాడు ,

"అయ్యగారూ ! నేను ఇంక మీ ఇంట్లో పని మానేస్తున్నానండీ "

" పదేళ్ళ నుండీ చేస్తున్నావు , ఇప్పుడేమోచ్చిందిరా ? "


"
మీరు నన్ను నమ్మట్లేదయ్యగారు "

"నమ్మక పోవటమేమిటి ? , మేము బయటకెళ్ళినప్పుడల్లా ఇంటి తాళాలు అన్నీ నీకే ఇచ్చి
వెళుతున్నాము కదా ! "

" నిజమే కానీండి , కానీ మీరు డబ్బులు పెట్టే లాకరు , తాళం చెవి తోను తెరుచుకోవట్లేదు "
లోని నిజం పొరపాటున బయట పెట్టాడు వీరయ్య

****************************************************

టాపిక్

"సుమన్ , నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది, కొంపతీసి నన్ను ప్రేమిస్తున్నావేమిటి ? "

" నిజమే సుశీ , పీకల్లోతు నీ ప్రేమ లో కూరుకుపోయాను "

" మరి పెళ్లి ఎప్పుడు చేసుకొందాం ? "

" నాకు టాపిక్ మార్చే వాళ్ళంటే చచ్చేంత అసహ్యం " అంటూ అక్కడ నుండీ వెళ్ళిపోయాడు
సుమన్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం