మంచి సలహా

*
వెంగళప్ప కి బాగా తిక్క , తిక్క గా ఉంది, రాత్రుళ్ళు నిద్ర పట్టటం లేదు .సైక్రియాట్రిస్ట్ సుమన్ ని
కలిసాడు , తన బాధ చెప్పాడు ,

" నేను రోజూ నిద్రపోదామని పడుకున్నపుడల్లా, నాకు మంచం క్రింద ఎవరో దాక్కుని ఉన్నట్లు
అనిపించి మూడు నెలల నుండి నిద్ర పట్టట్లేదు డాక్టర్ గారూ ! "

" అది ఒక రకమైన బ్రాంతి , దాన్ని నేను రెండు నెలల్లో తగ్గిస్తాను .ఖర్చు ఆరు వేలు .
రెండు వేలు ముందుగా తెచ్చి ఇస్తే ,నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను " చెప్పారు డాక్టర్.


మళ్ళీ డాక్టర్ మొహం కూడా చూడలేదు వెంగళప్ప .

కొన్ని నెలల తరువాత , రోడ్డు మీద వెంగళప్ప కి డాక్టర్ ఎదురు పడి అడిగారు ,

" ఎందుకు ట్రీట్మెంట్ కోసం రాలేదు ? , ఇప్పుడెలా ఉంది ? "

" ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది సార్, నాకు ట్రీట్మెంట్ కి యాభై రూపాయలే ఖర్చు అయ్యింది "

" యాభై రూపాయలతో తగ్గిపోయిందా ?, నిజంగా అద్భుతం , ఎలా జరిగింది ? "

"మా పక్కింటి ఆదిశేషు కి నా కష్టం చెప్పుకుంటే మంచి సలహా చెప్పాడు . అదివిని
ఒక చాప కొనుక్కొని నేల మీద పడుకొని హాయిగా నిద్ర పోతున్నాను "
చెప్పాడు వెంగళప్ప .

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం