*
సరదాల మన్మధ రావు , ఓ శుక్రవారం సాయంత్రం ఆఫీసు అవ్వంగానే మిత్రులతో కలిసి ,
అడవి లోని గెస్ట్ హౌస్ లో మజాగా సంబరాలు చేసుకున్నాడు .ఆదివారం రాత్రికి నెమ్మదిగా
పిల్లిలా ఇల్లు చేరి నిద్ర పోయాడు .
తెల్లారి లేచేసరికి కాళ్ళు , చేతులు మంచానికి కట్టేసున్నాయి .ఎదురుగా భార్య గోపిక కోపంగా
కాళిక లా నిలుచుని ఉంది .
ఓ గంట సేపు బతిమాలటాలు, తప్పు వొప్పుకోలు, ఒట్లు అన్నీ అయిన తరువాత ,కొద్దిగా కరిగింది
గోపిక .
" సరే , ఒక షరతు మీద కట్లు విప్పదీస్తాను.నేను ఇట్లాగే నీకు రెండు రోజులు కనపడక పోతే
నీకు ఎలా ఉంటుంది . నిజం చెప్పు " అంది .
విన్న మన్మధరావు కి చెవుల్లో అమృతం పోసినట్లైంది.మనసంతా సంతోషం .ఆ ఆనందాన్ని
దాచుకోవటానికి కష్టపడుతూ , గుంభనగా చెప్పాడు ,
" నేనేం నీలా అంత ఇబ్బందేమీ పడను "
" సరే " అంది గోపిక
తరువాత , ఆ రోజల్లా ఆమె కనపడలేదు , రెండో రోజూ కనపడలేదు .మూడో రోజూ వచ్చింది ,
కానీ కనపడలేదు .
గురువారం ఉదయం కనపడింది,మూడు రోజుల వాపు కొద్దిగా తగ్గిన కుడికన్ను కొస నుండి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం