చివరి కోరిక

*
గోన రాఘవరావు , తనకు ఊహ తెలిసినప్పటి నుండీ పరమ నాస్తికుడు.కలలో , మెలుకువలో
ఎక్కడా కూడా దేవుని ఉనికి గురించి ఒక్క క్షణం కూడా ఒప్పుకున్నవాడు కాదు .

ఆయన తన జీవితపు చివరి రోజులను, ఆస్పత్రి పడకపై ఉండి లెక్క పెట్టుకుంటున్నాడు .
ఇంతలో వాళ్ళావిడ సావిత్రి ఒక స్వామీజీ ని తీసుకొని వచ్చింది .

స్వామీజీ, రాఘవరావు ని చూసి ,

" ఈ నీ చివరి క్షణాలోనైనా , దేవుని ఉనికి ని నమ్ముతావా బాబూ " అని లాలనగా అడిగారు.

రాఘవరావు కొన్ని సెకనులు ఆలోచించి చెప్పాడు ,

" ఒప్పుకుంటున్నాను "

విన్న సావిత్రమ్మ కు నమ్మశక్యం కాలేదు.భర్తని అడిగింది ,

" మీరు భగవంతుడిని ఒప్పుకుంటున్నారా,నిజమేనా ? "

" నిజమే "

" ఈ మార్పు కి కారణం ఏమిటి ? "

" మార్పు లేదు,నా తలకాయా లేదు,దేవుని నమ్మేవాడు ఒకడు చస్తున్నాడన్న ఆనందంతో
పోదామని ,అంతే "

3 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం