*
క్యూ టీవీ వారి " పాటగాడు -పోటుగాడు" లో యాభై ఎపిసోడ్లు పాల్గొని , అందరిలో పోటుగాడిగా
ఎన్నికయ్యాడు త్రివిక్రమ్ .
అలాంటి వాడు , ఎందుకో తేడా చేసి , మానసిక వైద్యుడి దగ్గరకి వెళ్ళాడు .ఆయన అడిగారు ,
"మీ సమస్య ఏమిటీ ? "
" ఈ మధ్య ఎప్పుడు ఘంటసాల పాటలు పాడుతున్నా , నా చెవిలో ఎవరో "పాడద్దు,ఆపు "
అన్నట్లు వినిపిస్తోందండీ "
" ఆ గొంతు ఎవరిదో మీరు గుర్తుపట్టగలిగారా ? " అడిగారు డాక్టర్
" ఆ గుర్తుకొచ్చింది " అంటూ ఒక్క క్షణం ఆగాడు త్రివిక్రమ్ .
" ఎవరిదీ , చెప్పండి "
" అది ఘంటసాల గారి గొంతు " చెప్పాడు త్రి .
:)
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండి:))
రిప్లయితొలగించండి