బీరుదాసు

*

డాక్టర్ రమణాచారి దగ్గరకు అన్నమయ్య వచ్చి ,తన బాధ ను చెప్పుకున్నాడు ,

"డాక్టర్ గారూ ! నాకు రోజూ బీరు తాగటం బాగా అలవాటై పోయిందండీ .దాంతో నామనసుకు
చాలా బాధగా ఉంటోందండీ.తప్పు చేస్తున్నాను అన్న ఆలోచన నన్ను చాలా ఇబ్బంది
పెడుతోంది .ఏదైనా మంచి మందిచ్చి పుణ్యం కట్టుకోండి "


" ఎన్నాళ్ళ నుండీ ఇలా ఉంది ? "

" రెండేళ్ళ నుండీ అండీ "

"సరే మందులు రాసిస్తాను , అవి వాడితే నీకు బీరంటే , విరక్తి కలుగుతుంది "

"డాక్టర్ గారూ ! మీరు తప్పుగా అర్ధం చేసుకొన్నారు ,నాకు బీరంటే చాలా ఇష్టం ,
తప్పు చేస్తున్నాను అన్న ఆలోచన , బాధ పోయేందుకు మందిస్తే చాలు " చెప్పాడు
అన్నమయ్య .

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం