*
నరసింహారావుకు ఓ రెండేళ్ళలో ఉద్యోగవిరమణ.అతనికి రామలక్ష్మితో పెళ్లై 40 ఏళ్ళు దాటింది.
తను డబ్బు దుబారా చేసే మనిషి కావటం తో ,జీతం రాళ్ళు అన్నీ భార్య చేతిలో పోసేవాడు .
ఆమె జాగర్త చేసేది .రూపాయి కావాలన్నా ఆమెని అడిగి తీసుకునేవాడు .
ఒకసారి ,
భర్త బయట ఊరు వెళ్ళినప్పుడు , అవసరపడి అతని అలమారా వెతికింది రామలక్ష్మి .
కావలసింది దొరికింది . దానితో పాటు ఒక డబ్బు సంచీ దొరికింది .దానిలో ఆమెకి
నలభై వేల రూపాయిలు , ఓ పన్నెండు రుద్రాక్షలు కనిపించాయి .
ఆమెకి ఏమీ అర్ధం కాలేదు .ఒక్క పైసా కూడా దాచుకొని మనిషి దగ్గర నలభై వేలు
తనకు తెలీకుండా ఉండటం ,వాటితో పాటు రుద్రాక్షలు ?
ఊరు నుండీ వచ్చిన భర్త ని మంచి సమయం చూసుకొని అడిగింది ,
" ఏమండీ , మీ బీరువాలో ఈ సంచీ ఉంది , ఇది మీదేనా ,అయితే రుద్రాక్ష లు ఎందుకు
దాచారు , డబ్బు ఎక్కడిది ? "
నరసింహారావు బదులిచ్చాడు ,
" సంచీ నాదే , నువ్వు క్షమిస్తానంటే నిజం చెబుతాను .మన పెళ్లి అయినప్పటి నుండీ
నేను నీతో అబద్ధం చెప్పినపుడల్లా ఒక రుద్రాక్షని ఈ సంచీలో వేసేవాడిని "
రామలక్ష్మి ఒక్క క్షణం బాధపడింది .తరువాత నలభై ఏళ్ల కాపురం లో భర్త తనతో
ఆడింది పన్నెండు అబద్ధాలే కదా అని సమాధాన పడి అడిగింది ,
" మరి ఈ నలభై వేలు ? "
" నూట ఎనిమిది రుద్రాక్షల మాలలు,ఒక్కొక్కటీ వంద రూపాయలకు అమ్మితే వచ్చిన సొమ్ము
అది " నిజం పూర్తి చేసాడు నరసింహారావు
:)
రిప్లయితొలగించండిdidn't get it :(
రిప్లయితొలగించండిమొత్తం అబద్దాలు :
రిప్లయితొలగించండిఅమ్మిన రుద్రాక్ష మాలలు = 40000/100 =400
ఒక మాలకి రుద్రాక్షలు = 108
మొత్తం రుద్రాక్షలు = 12+(400*108) = 43212
అబద్దాలు = రుద్రాక్షలు
అంటే ,రోజూ ఆబద్దాలే చెప్పేవాడు
:)
రిప్లయితొలగించండి