*
ఇంద్రుడు స్వర్గం లో ఈ మధ్య జరుగుతున్న అపరాధాలు అరికట్టటానికి ,డిటెక్టీవ్ యుగంధర్
ని శాశ్వతం గా స్వర్గానికి రప్పిద్దామని రహస్య మంత్రాంగం చేసాడు.ఆ విషయం యుగంధర్
కనిపెట్టేసాడు .తనకు వారసులుగా మంచి డిటెక్టీవ్ లను తయారు చేయటానికి ముగ్గురు
బాకుల్లాంటి చురుకైన కుర్రాళ్ళని ఎన్నికచేసి బాగా శిక్షణ నివ్వటం మొదలు పెట్టాడు .
కొన్నాళ్ల తరువాత ,
కుర్రాళ్ళు బాగా నేర్చుకున్నారా లేదా అని ఒక పరిక్ష పెట్టాడు . ముగ్గురిని వేరు వేరు గదుల్లో
ఉంచాడు .మొదటి వాడికి ఒక ఫోటో చూపించి అడిగాడు ,
"ఈమెని ఎలా పట్టుకొంటావు ? "
కుర్రాడు ఆ ఫోటోని పరిశీలనగా చూసి ,
" ఈమెని పట్టుకోవటం చాలా ఈజీ సార్, ఎందుకంటే ఈమెకి ఒక కన్ను మిస్సింగ్ సార్ "
యుగంధర్ మాట్లాడ కుండా అక్కడనుండీ కదిలి పక్క గదిలోకి వెళ్ళాడు.రెండో అతనికి
ఓ ఫోటో చూపించి,ఎలా పట్టుకుంటావని అడిగాడు ,
" సార్ ! పట్టుకోవటం యమా సులువు సార్ , ఈమెకి ఒక చెవి లేదు కదా సార్ "
యుగంధర్ వాడి వంక గుడ్లురిమి చూస్తూ, వాడిని నాతో రా అని మొదటి వాడి గదిలోకి
తీసుకెళ్ళి ఇద్దరిపైనా ఒక్కసారిగా అరిచాడు
"నేను మీకు చూపించింది అమ్మాయి సైడుఫోటో. అది చూసి అతి తెలివితేటలు ప్రదర్శిస్తారే ? "
అలా అని మూడో వాడి గదిలోకి వెళ్లి చెప్పాడు ,
"నేను చూపించే ఫోటో చూసి, సరిగా ఆలోచించి, కొద్దిగా టైము తీసుకొని అయినా సరే , ఎట్టా
పట్టు కుంటావో చెప్పాలి "
ఫోటో చూపించాడు , కుర్రాడు బాగా అన్ని కోణాల్లో శ్రద్ధ గా పరిశీలించి చూసి చెప్పాడు ,
" సార్ ! ఈ వ్యక్తి కి కాంటాక్ట్ లెన్సులు ఉన్నాయి "
యుగంధర్ అబ్బురపడి,తనకి కూడా తట్టని విషయం ఇతనికి ఎలా తట్టిందా అని ,కుర్రాడితో
అన్నాడు ,
"నాకు కాంటాక్ట్ లెన్స్ ఉన్నాయో లేవో తెలీదు,ఒక్కసారి రికార్డ్ చూసి చెబుతాను" అన్నాడు.
లోపలికి వెళ్లి రికార్డ్ చూసాడు . కుర్రాడు చెప్పినట్లే ఆ అపరాధికి కాంటాక్ట్ లెన్స్ ఉన్నాయి.
బయటకి వచ్చి ఆనందంగా చెప్పాడు ,
" నువ్వు రా ,నా వారసుడివి .నన్ను మించి గొప్ప డిటెక్టీవ్ అవుతావు. ఇంతకీ నువ్వు ఎలా
కనిపెట్టావు ? "
"ఏముంది సార్ దీంట్లో , యమా ఈజీ సార్ ,అమ్మాయికి ఒక కన్ను , ఒక చెవి లేనప్పుడు
కాంటాక్ట్ లెన్సులు కాక , మామూలు కళ్ళజోడు ఎలా పెట్టుకొంటుంది సార్ "
LOL ...
రిప్లయితొలగించండిhahahahaha, baagundi.
రిప్లయితొలగించండిsuper
రిప్లయితొలగించండిhilariuos :))))
రిప్లయితొలగించండిఅతని క౦టె ఘనుడు బాగు౦ది.
రిప్లయితొలగించండి