తూకం

*
సుభద్రమ్మ విసురుగా శ్రీకృష్ణ స్వీట్స్ వారి కొట్టులోకి అడుగుపెట్టింది. తన వెనకాలే వచ్చిన
మనవడిని ,

"బోసూ, నీకు ఇందాక స్వీట్స్ కట్టిచ్చింది ఎవరో చూపించారా " అంది

వాడు అక్కడున్న వారిలో అతి బక్కగా ఉన్న కుర్రాడిని చూపించాడు ,సుభద్రమ్మ వాడి
మీదకి వెళ్లి అరిచింది ,

"ఏరా, ఇందాక నీ కొట్లో మూడు కేజీలు పీచు మిఠాయి , రెండు కేజీలు కారబ్బుందీ పట్రమ్మని
నా మనవడిని పంపిస్తే , పసి వాడికి తెలీదని రెండు కేజీలు పీచు మిఠాయి ,ఒక కేజీ బుందీ
కట్టి పంపిస్తావా ?, మర్యాదగా మిగతాది కట్టి ఇవ్వు "

పాపం బక్క చిక్కిన కుర్రోడు , వినయంగా జవాబిచ్చాడు ,

" అమ్మా ! ఒక్కసారి మీ పిల్లాడి బరువు కూడా చూడండి "

1 కామెంట్‌:

  1. he he he... ప్రతి రోజు కామెంటక పోయినా రోజు తప్పని సరి గా చూసే బ్లాగు లలో మీదొకటి.. please keep posting

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం