*
డాక్టర్ గణపతి ఎదురుగా దిగులుగా పరిమళ కూర్చొని ఉంది. డాక్టర్ చెప్పింది ఆమెకు
నమ్మబుద్ధి కావటం లేదు.డాక్టర్ తో ,
"లేదు,నేను అంత బరువు ఉండను.నేను నా ఎత్తుకు తగ్గ బరువే ఉన్నాను " అంది .
" లేదమ్మా , నేను సరిగానే చూసాను. నువ్వు ఉండాల్సిన దానికంటే ముప్పై కేజీలు బరువు
ఎక్కువే ఉన్నావు "
" నేనొప్పుకోను , మీరు మళ్ళీ ఒక్కసారి సరిగా పట్టిక చూసి చెప్పండి "
డాక్టర్ పట్టిక మళ్ళీ చూసి చెప్పారు ,
" అమ్మా , నా దగ్గరున్న పట్టిక ప్రకారం, మీ బరువుకి మీరు 5 అంగుళాలు తక్కువ ఎత్తు
ఉన్నారు "
ఆమె కోర కోరా చూస్తూ లేచి వెళ్ళిపోయింది. ఆ వెంటనే డాక్టర్ స్నేహితుడు ఏకాంబరం
చాలా ఏళ్ళకి అతన్ని కలవటానికి వచ్చాడు . మాటలు మొదలయ్యాయి .
ఏకాంబరం అడిగాడు ,
" ఏరా గణపతీ , ఈ మధ్య ఎక్క విన్నా నీ పేరే చెబుతున్నారు .నీ దగ్గర కొస్తే ఏనుగైనా
మూడు నెలల్లో జింక పిల్లలా మార్చేస్తున్నావట. ఆ రహస్యమేమిటో నాక్కూడా
చెప్పరా, మా ఆవిడ మీద ప్రయోగిస్తాను "
"నా పేషెంట్లు రోజూ హాస్పటలికి రావాలి .నేను చెప్పినట్లు చేయాలి. నువ్వు గమనించే
ఉంటావు , నాది ఆరో అంతస్తు , లిఫ్ట్ లేదు , అంతే "
chalaa chakkaga undi.
రిప్లయితొలగించండి