నీ ఇష్టం

*
ఉదయం 11 గంటల సమయం ,

"యోగమందిరం"వారి యోగ ఆధ్యాత్మిక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం అప్పుడే పూర్తి అయ్యింది .
పాల్గొన్నవారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు .ఇంతలో వారందరి సెల్ ఫోనులు
ఉంచిన టేబుల్ పైన సెల్ ఫోను మోగింది .

చేతులు తడిగా ఉండటంతో అమరేంద్ర సెల్ ఫోను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడటం మొదలు పెట్టాడు.

అవతలినుండి తీయని స్త్రీ గొంతు పలికింది , మిగిలిన వారు ఆగి ఆసక్తిగా వినసాగారు.

"ఏమండీ , నేను ఇప్పుడే బిగ్ బజార్ కి వచ్చాను .ఇక్కడ నాకు ఒక టేకు టీపాయ్ బాగా
నచ్చింది ,ఖరీదు పది వేలు , కొనుక్కో మంటారా ? "

అమరేంద్ర ,

" నీకు నచ్చిందిగా, కొనుక్కో "

" మరి నేను వచ్చే దారిలో, శాంత్రో వాళ్ల కొత్త మోడల్ కారు చూసానండీ ,నాకు పిచ్చ పిచ్చగా
నచ్చేసింది .ఆరు లక్షలే. తీసుకోనా ? "

"నీకు బాగా నచ్చింది కదా , అన్ని పన్నులు ,మిగతాలు , వగైరాలు అన్నీ కలిపి ఆరు కి ఇస్తే
తీసుకో "

" అందుకే మీరంటే నాకెంతో ఇష్టం , లవ్ యు డియర్ "

ఫోను ఆగిపోయింది . మళ్ళీ ఒక నిమిషం లో మోగింది . అమరేంద్ర మళ్ళీ స్పీకర్ ఆన్
చేసి మాట్లాడసాగాడు.

"ఏమండీ , ఇప్పుడే ఫోను వచ్చింది . మూడు నెలల క్రితం మరీ ఎక్కువ చెప్పాడని బెసెంట్ రోడ్లో
స్థలం వదిలేసామే , బ్రోకర్ మళ్ళీ ఫోను చేసాడు , లక్ష తగ్గించి చెబుతున్నాడు .ఏం చేద్దాం "

"ఇంకో యాభై వేలు తగ్గించమను, కాదూ,కూడదంటే అడ్వాన్స్ ఇచ్చేయ్ ,పర్లేదు "

వింటున్న మిగిలిన వారి బుర్రలు పనిచేయటం మానివేసాయి .ఆవిడ అడిగిన ప్రతి దానికి వూ
కొట్టిన అమరేంద్ర వంక నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు .

అమరేంద్ర ఫోను పెట్టేసి ,

" ఇంతకీ సెల్ ఫోను ఎవరిదీ " అని అడిగాడు

6 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం