స్వర్గం లో

*

ఒక స్వామీజీ,ఒక లాయరు మరణించిన తరువాత స్వర్గంలోకి ప్రవేశించారు.దేవదూతలు వారికి
సాదరంగా స్వాగతం పలికారు.

స్వామీజీకి ఒక చక్కని విడిది ఏర్పాటు చేసారు.లాయర్ కి ఇంద్రభవనంలో విడిది ఏర్పాటయ్యింది.

ఇదంతా గమనిస్తున్న లాయర్ గారు ,తన సహజ సిద్దమైన పద్దతిలో అనుమానం వ్యక్తం చేసాడు,
దేవదూతలతో ,

"అయ్యా ! స్వామీజీ కి మామూలు వసతి ఏర్పాటు చేసారు ,నాకు ఇంద్ర భవనంలో విడిది
ఇచ్చారు .నేను ఆయన కంటే గొప్పవాడిని కాదు కదా ? "

దేవదూతలు బదులిచ్చారు ,

"ఇంద్రులవారు ఇలా ఏర్పాటు చేసారు .మేము వారి ఆజ్ఞని పాలించాము "

లాయర్ గారు ఇంద్రుని ఆచూకీ కూపీ లాగి,వారిని సమీపించి పై అనుమానాన్ని మళ్ళీ వ్యక్తం
చేసారు

ఇంద్రుడిలా చెప్పాడు ,

"నాయనా , స్వర్గానికి స్వామీజీ లు ఎప్పుడూ వస్తూనే ఉంటారు .కానీ లాయరు స్వర్గానికి
రావటం ఇప్పటివరకు జరగలేదు.నువ్వు మొదటి వాడివి .అందుచేత నీకు ప్రత్యేకమైన
మర్యాదలు చేస్తున్నాము"

5 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం