*
బెజవాడ కనకదుర్గమ్మ ను చూసి , భవానీ ద్వీపం లో ఓ మర పడవని అద్దెకి తీసుకొని
కృష్ణానదిలో " లాహిరి లాహిరి లాహిరి లో " అని పాడుకుంటూ షికారు చేస్తున్నారు
వెంకటప్పయ్య దంపతులు .
నది మద్యలో పడవ ఇంజను విచిత్రంగా శబ్దం చేసింది.ఆ తరువాత పడవ బాగా అటూ ఇటూ
ఊగటం మొదలు పెట్టింది .దాంతో అలివేణి భయంతో బెంబేలెత్తి వణుకుతూ పూడుకుపోయిన
గొంతుతో అంది ,
" ఏమండీ ! పడవ మునిగిపోతోందండీ "
" ఆ పడవ వెధవ మన దగ్గర ఎక్కువ డబ్బులు గుంజాడుగా,వాడికి తగిన శాస్తి
జరుగాలి .బాగా మునగనీ " అన్నాడు కసిగా వెంకటప్పయ్య .
hahahahhahahahaha, navvaleka chachanu.
రిప్లయితొలగించండిGood one :D
రిప్లయితొలగించండి