*
డాక్టర్ గున్నేశ్వరరావు మంచి పళ్ళ డాక్టర్ .నెప్పి తెలీకుండా పన్ను పీకుతాడని పెద్ద పేరు .
కానీ ఆ నెప్పి ఫీజు లో తెలుస్తుంది పేషెంట్ కి అని గిట్టనివాళ్లు అంటుంటారు .
తిరుమల రావు తన పుచ్చిపోయిన పన్ను పీకించుకోవటానికి వచ్చాడు .అతన్ని కుర్చీ లో
కూర్చోబెట్టి ఆయుధాలు చేతిలోకి తీసుకొంటున్నాడు డాక్టర్ .
అంతలో తిరుమల రావు బాధతో గట్టిగా అరిచాడు .
"ఇంకా నేను పీకటం మొదలు పెట్టలేదు , అప్పుడే అరుపులేంటి " కోపంగా చూసి అడిగాడు
డాక్టర్ .
"మీ బూటు కాలు , నా పాదం మీద వేసి ఇందాకడ నుండీ తొక్కుతున్నారు " చెప్పాడు
బాధగా తిరుమల రావు
మంచి ప్రయత్నం. హాస్యాన్ని ఇంకాస్త పండించి వుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తప్పుగా తీసుకోవద్దు.
రిప్లయితొలగించండిnaku emi joke anipinchalede
రిప్లయితొలగించండినిజానికి జోక్ చాలా బాగుంది. డాక్టర్ introduction చదివిన తర్వాత expectations పెరిగాయి. జోక్ చదివిన తర్వాత ఇంకా వుందా అనిపించింది. దానికి కారణం "నెప్పి ఫీజు లో తెలుస్తుంది" అనే వ్యాక్యం. నేను ఫీజు కు సంబందించిన జోక్ అనే వుద్దేశంతో చదివాను అన్నమాట.
రిప్లయితొలగించండిడాక్టర్ introduction కేక.
జోక్ చాలా బాగుంది.
overall rating మాత్రం బాగుంది.
I mean overall feel of joke is good, very good in pieces.