*
ఉదయం ఎనిమిది గంటలు ,
"పనిమనిషి రంగి కోసం బ్రూ కాఫీ కలిపి అప్పటికి గంట దాటింది .రోజూ ఏడింటికే వచ్చేస్తుంది .
దాని సెల్ కూడా ఎత్తట్లేదు.ఏం పుట్టిందో దీనికి , ముందుగా చెప్పి చావదు " అని మనసు లో
తిట్టుకొంటూ వీధి గుమ్మం వైపు ఆశగా చూస్తోంది ఆశ్లేష .
ఆమె సహనం పూర్తిగా కోల్పోయే లోపు రంగి నిదానంగా ఇంట్లోకి అడుగు పెట్టింది .మాట్లాడకుండా
చీపురు తో గదులు శుభ్రం చేయసాగింది.
ఆశ్లేష తన కోపాన్ని చూపించటానికి ,
"ఇక్కడ సోఫా క్రీడ చూడు ఎంత బూజు ఉందో, రెండు నెలలయ్యింది దులిపి, అదిగో ఆ ఫ్రిజ్ పైన
చూడు , ఎంత దుమ్ము పట్టిందో , మూడు నెలలయ్యింది కనీసం తుడిచి " అని అరిచింది
"అమ్మగారూ, దాంట్లో నా తప్పేమీ లేదు,నేను మీ దగ్గర పనికి జేరి నెలే అయ్యింది .ముందు
పనిచేసిన అనసూయదే బాధ్యతంతా "
ఇదేదో అచ్చం రాజశేఖర్ రెడ్డి ,చంద్రబాబుల గొడవలా ఉంది .
రిప్లయితొలగించండి