స్వర్గం లో చదరంగం

*
వాసు , కళ్యాణ్ లది చిన్ననాటి స్నేహం .ఇద్దరూ చదరంగం పిచ్చోళ్ళే. నేటికి వారి స్నేహం
వయసు చదరంగం లోని గళ్ళన్ని ఏళ్ళు .వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఒట్టు పెట్టుకున్నారు.
ఎవరు ముందు బాల్చీ తన్నేసి పైకి జేరతారో వారు ,రెండోవారికి పై లోకం లో చదరంగం
ఆట ఉందా లేదా అన్నది చెప్పాలి .

ఒకరోజు యముడు,తన పాశం తో,కళ్యాణ్ ప్రాణాలకి చెక్ పెట్టాడు . అది జరిగిన ఇరవై
రోజులకు ,వాసు కలలోకి వచ్చాడు కళ్యాణ్ . వాసుతో చెప్పాడు,

"
స్వర్గం, నరకం రెండింట్లో చదరంగం ఆట ఉంది .పోటీలు కూడా పెడతారు.రేపు జరగబోయే
పోటీ లో నేను,నీతో ఆడుతున్నాను "

3 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం