*
అప్పన్న దొర కాలనీ పోలీసు స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారూ తన ఎదురుగా నుంచున్న కవిత ,
మదన్ లను అడిగాడు ,
"మీ ఇంటికి ఎదురుగా ఉన్న అద్దాల షాప్ లో పది పెద్ద అద్దాలను పగలగొట్టారా ? "
వెంటనే కవిత చెప్పింది ,
" నేను పగల కొట్టలేదు , మాఆయన పగలకొట్టాడు "
"నేను నిజంగా పగలుకొట్టలేదు " అంటూ మరేదో చెప్పబోయాడు మదన్ .భార్య చూపుతో
అతని నోటికి తాళం పడింది .ఆమె కొనసాగించింది ,
"నేను మా ఆయన మీద బాగా కోపం వచ్చి , ఆయన మీదకు పచ్చడి బండ గురి చూసి
మరీ విసిరాను ,కానీ కొద్దిలో తప్పించుకున్నాడు "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం