*
రాత్రి ఒంటి గంట అయ్యింది ,
మస్తాన్ రావు బ్రహ్మాండంగా గురక పెడుతూ,హాయిగా నిద్రపోతున్నాడు. అతని పక్కన పడుకొని
నిద్ర పోతున్న నాలుగేళ్ల చిట్టి తల్లి నిద్రలో వులిక్కి పడుతోంది ,అతని గురక పెరిగినప్పుడల్లా .
ఇంతలో ఫోను మోగటం మొదలుపెట్టింది ,ఆగకుండా .
అతికష్టం మీద మస్తాన్ లేచి ఫోను తీసాడు ,
"నేను మీ పక్కింటిలో నిన్ననే దిగాను .నా పేరు వెంగళరావు.మీ కుక్క ఇందాకడి నుండి
ఆగకుండా మొరుగుతోంది .మాకు నిద్రపట్టటం లేదు .దాన్ని మొరగటం ఆపించండి " అని
అరిచి అవతలి వ్యక్తి ఫోను పెట్టేసాడు .
మస్తాన్ రావు ఒక్కసారి అయోమయంగా చూసి మళ్ళీ గురకలోకి జారి పోయాడు .
మరునాడు , రాత్రి రెండు గంటల సమయం ,
ఫోను మోగింది,వెంగళరావు ఇంట్లో. వెంగళరావు కి నిద్రాభంగమయ్యింది.బండ బూతులు
తిట్టుకొంటూ ఫోను ఎత్తాడు.
అవతలి వ్యక్తి ,
"అయ్యా , నేను మీ పక్కింట్లో ఉండే మస్తాన్ రావుని .నిన్న మొరిగింది మాకుక్క కాదు .మేము
కుక్కలని పెంచము " అని చెప్పి ఫోను పెట్టేసాడు.
హ హ్హ హ్హా :))))
రిప్లయితొలగించండిBagundi :)
రిప్లయితొలగించండి