అలవాటు

*
భవానీపతిరావు పనిబడి ఆగిరిపల్లి నుండీ విజయవాడ వచ్చాడు.మధ్యాహ్నం ఆకలేసి బీసెంట్
రోడ్ లో మోడరన్ కేఫ్ లో అడుగు పెట్టాడు. ఫుల్ మీల్స్ టోకెన్ తీసుకొని టేబుల్ దగ్గర
కూర్చొన్నాడు. సర్వర్ వచ్చాడు ,కంచం లో అన్నీ వడ్డించాడు.

భవానీపతి అడిగిమరీ ఆయకాయ , గోంగూర పచ్చడులు కంచంలో వేయించుకొన్నాడు.
కానీ పావు గంటైనా తినటం మొదలు పెట్టలేదు. విషయం తెలుసు కొందామని సర్వర్ అడిగాడు,

"అయ్యా ! ఇంకేమైనా కావాలా ?, ఎందుకు తినటం మొదలు పెట్టలేదు ? "

" నాకు ఒక అలవాటు ఉంది ,అది ఉంటే గానీ నాకు భోజనం చేయబుద్ది కాదు "

" ముందు మందు ఏమైనా పుచ్చుకోవాలా ,రోడ్ చివర మందుల షాపు ఉంది "

"లేదు , అలాంటి అవసరం లేదు "

"మరి మీకు ఏం కావాలో చెప్పండి "

"బాగా సాధించే అమ్మాయి ఎవరన్నా ఉంటే పట్టుకురా ,నేను తింటున్న సేపు అది బాగా
నన్ను సాధిస్తూ ఉండాలి ,లేకుంటే ముద్ద గొంతు దిగదు.ఇంట్లో ముప్పై ఏళ్లుగా అలవాటు "

3 కామెంట్‌లు:

  1. బాగుంది శ్రీకాంత్ గారు మీ భోజనా పద్దతి తప్పదు మరి ఒక్కొక్కసారి ఈసారికి ఇలా కానిచ్చేయండి

    రిప్లయితొలగించండి
  2. :):) అంటే అచ్చం నా పోలికలు ఉన్న అమ్మాయన్నమాట :)

    రిప్లయితొలగించండి
  3. hahahahaha, amma pette aa naalugu padaalanna maata ! :-))

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం