*
గీతకి పెద్దవయసు వచ్చింది .వస్తూ తనతో బాటు మతిమరపుని కూడా వెంటబెట్టుకొని వచ్చింది.
ఆ రోజు కంటి అద్దాలు,మార్చుకోవాలని,పరీక్ష చేయించుకోవటం కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళింది .
మరి కొద్దిగా చూపు తగ్గటం తో డాక్టర్ కొత్త అద్దాలు రాసారు.
తిరుగు ప్రయాణం లో , డాక్టర్ దగ్గర తన హ్యాండ్ బ్యాగ్ మర్చి పోయానని గుర్తుకొచ్చింది .
కారు నడుపుతున్న భర్తతో చెప్పింది,ఆయన సనగటం మొదలు పెట్టాడు ,
" బ్యాగ్ వదిలేసి రావటం ఒక తప్పు , ఆ సంగతి ఓ అరగంట తరువాత చెప్పటం ఒక తప్పు .
మరీ నీ మతిమరుపుతో నన్ను చంపేస్తున్నావు .నాకు భయం గా ఉంది .తొందరలో ఏదో ఒక
రోజు నేను నీ భర్త ని కాదంటావు "
ఆయన తిట్ల ప్రవాహం అలా సాగుతూనే ఉంది . తిరిగి కారు డాక్టర్ గారి హాస్పటల్ ముందు
ఆగింది .గీత వడివడి గా కిందకి దిగి లోపలికి వెళుతోంది .వెనక నుండీ భర్త కేక వినపడింది ,
"నా సెల్ ఫోను రిసెప్షన్ దగ్గర మర్చి పోయా , అది కూడా తీసుకురా "
హహహ
రిప్లయితొలగించండిహ హ హ బావుంది
రిప్లయితొలగించండి