*
భార్య గొడవ భరించ లేక చెవి డాక్టర్ దగ్గరకు వినికిడి పరీక్షకు వెళ్ళాడు గోపాలం . డాక్టర్ తెనాలి రామకృష్ణ సరదాగా రాజకీయాలు , పేకాట, హీరోయిన్లు , మందు మొదలైన వాటి గురించి మంద్ర స్థాయి నుండి తారా స్థాయి స్వరం వరకు ఉపయోగించి మాట్లాడాడు .అంతా సుబ్బరం గానే వినపడింది గోపాలానికి .తరవాత అరగంట గోపాలం భార్య ఆండాళ్ళు మాట్లాడింది .పరీక్ష పూర్తి అయ్యింది .ఫలితం తెలిసింది .
డాక్టర్ నోరు తెరిచాడు ,
" అమ్మ ఆండాళ్ళు , మీ ఆయనకు వినికిడి బాగానే ఉంది .కాని నీ మాటల్లో అతనికి 10 శాతం మాత్రమే వినపడుతున్నాయి "
"ఆయనకు చెముడు వచ్చిందేమోనని భయపడ్డాను .ఇకనుంచి ఆయనకు ప్రతిదీ 10 సార్లు చెప్పే కష్టం నేను పడతాలెండి "
నాకు జోక్ సరిగ్గా అర్థం కాలేదండి! :|
రిప్లయితొలగించండిఇష్టం లేని మాటలు వినపడవు.10 సార్లు చెప్పి తప్పక వినేట్లు చేస్తుంది ఆండాళ్ళు.
రిప్లయితొలగించండిఓహో!
రిప్లయితొలగించండి