ఇంటిదారి

*
మార్కాపురం చక్రపాణి కి చాలా విసుగ్గా , చిరాగ్గా ఉంది .పరిష్కారం కోసం ఐడియా చిప్ లు అమ్ముకొనే విక్రమ్ కు ఫోను చేసాడు ,

"విక్కీ !ఇంట్లో పిల్లి తో చాలా ఇబ్బందిగా ఉందిరా . మా కళ్లు కప్పి ఇంట్లో కొచ్చి పాలు తాగేస్తుంది .మజ్జిగ పారబోస్తుంది .ఇల్లు చెత్త చేస్తోంది .దాన్ని వొదిలిచ్చుకోవటానికి ఒక ఐడియా చెప్పరా "


"చక్రి ! దాన్ని వూరవతల వదిలేసి రా "

చక్ర పాణి అతి కష్టం తో పిల్లిని పట్టుకొని , వూరవతల విడిచాడు .

కాని ఆ రాత్రి మజ్జిగంతా పిల్లి తాగేసింది .

పట్టువదలని చక్రపాణి "ఫోను కొట్టు ,ఐడియా పట్టు " ప్రోగ్రాం కు మళ్ళీ డయల్ చేసాడు

విక్కీ : పక్క జిల్లా లో ఉన్న మీ మామ గారింట్లో పడేసి రా . దాంతో వాళ్ళపై నీ కసి తీరుతుంది . పిల్లి పీడ వదులుతుంది .

బుద్ధి మంతుడైన చక్రి అటులనే చేసెను . రెండో రోజు ఉదయం పాలమ్మాయి దగ్గర రెండు సేర్ల పాలు పోయించుకోంది పిల్లి .

చక్రికి చిర్రెత్తింది .బుర్ర పిచ్చెక్కింది . వేరే దారి లేక విక్కి ఎడమ మోకాలు పై సెల్ తో కొట్టాడు .

అభయముద్ర తో విక్కీ చెప్పాడు ,

"ఈ ఐడియా ఖచ్చితంగా వర్క్ అవుతుంది . సెల్ టవర్ పై ఆన . వెళ్లి పిల్లిని నల్లమల అడవుల్లో
వదిలేసి రా . తిరిగొచ్చే అవకాశమే లేదు "

చక్రి పాపం పిల్లిని అడవిలో వదిలేసాడు . నక్సలైట్లు , పోలిసుల బారిన పడకుండా ఇల్లు చేరాడు .

విక్కీ ఫోను చేసి " నా ఐడియా వర్క్ ఔట్ కాకపోవటం ఉండదు.కొద్దిగా లేటు అంతే " అన్నాడు గర్వంగా

చక్రీ అరిచాడు హృదయ విదారకం గా ,

"నీ దిక్కుమాలిన ఐడియా తో అడవిలో తప్పిపోయాను , పిల్లి దారి చూపించింది కాబట్టి తిరిగొచ్చాను క్షేమంగా "

3 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం