పిప్పి పన్ను

*
పంటి డాక్టర్ ఆదిశేషు దగ్గరకు వెళ్ళింది మహాలక్ష్మి .

"డాక్టర్ గారు ,పిప్పి పన్ను తో చాలా బాధగా ఉంది .దాన్ని పీకటానికి మీరు ఫీజు ఎంత తీసుకుంటారు ? "

"మూడు వందలు , ఒక పన్నుకి " చెప్పారు డాక్టర్

"నా దగ్గర నూట యాభై రూపాయలే ఉంది .కాస్త దాన్ని తీసుకొని పీకగలరా ? "

"మత్తు మందు ఇవ్వకుండా చేస్తాను , మీకు ఇష్టమైతే "

" సరే "

" అయితే కుర్చీ లో కూర్చోండి "

"ఏమండీ ! ఇలా వచ్చి కుర్చీ లో కూర్చోండి " బయట వెయిట్ చేస్తున్న భర్తని కేకేసింది మహాలక్ష్మి

3 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం