*
శివరాత్రి రోజు ఓ నవ యువకుడు , శివాలయం లోకి అడుగు పెట్టాడు .అక్కడి భక్తులకు కావలసిన
సహాయం చేస్తున్నాడు .పూజారి గారు అతన్ని చూసి ముచ్చట పడి,
"ఈ రోజుల్లో నీ లాంటి యువకులు గుడి కి రావటమే అరుదు ,అదీ వంటరిగా .నీకు ఎందుకు
గుడికి రావాలనిపించింది? "
"నాన్నగారు చెప్పారు "
"తండ్రి మాట విని వచ్చావా బాబూ "
"అవునండీ , నేను ఒకే టిక్కెట్ పై రెండు సినిమాలు చుద్దామనుకున్నాను.కాని నాన్న గారు
నన్ను శివాలయానికి వెళ్ళమన్నారు "
"మరి నాన్న గారు రాలేదా ? "
"సినిమా టిక్కెట్ ఒకటే దొరికింది . దాంతో ఆయన సినిమాకి వెళ్ళారు "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం