*
మచిలీపట్నం హిందూ హైస్కూల్ లో , 6 వ తరగతి గది ,
"ఏరా , రామూ ! వారం నుండి స్కూల్ కు రాలేదే ? " అడిగారు వరదాచార్యులు మాస్టారు.
"విజయవాడ వెళ్ళా నండీ "
"బెజవాడ లో వారం రోజులు ఏం అఘోరించావు , పరిక్షలు దగ్గర పడుతుంటే "
"విజయవాడ లో ఒక్క రోజే ఉన్నాను మాస్టారూ " చెప్పాడు రాము.
"అంటే ఉళ్ళో ఉండే రాలేదన్నమాట "
"లేదు మాస్టారూ ,ఈ రోజు ఉదయమే వచ్చానండీ "
"బెజవాడ నుండి బందరు రావటానికి వారం పట్టిందా ?, పాక్కుంటూ వచ్చావా ? " గద్దించారు
మాస్టారు
"లేదు మాస్టారూ, మా బాబాయి రోడ్ రోలర్ మన ఊరు వస్తుంటే ,అది ఎక్కి వచ్చాను "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం