పై లోకంలో బ్లాగరు

*

యమధర్మరాజు గారికి బ్లాగులంటే ఎంతో ముచ్చట .ఒక బ్లాగరు మరణించి పైకి వెళ్ళాడు .
యముడు ,ఆయన్ని చూసి ,

"మీరు ఒక్క సారి స్వర్గం, నరకం చూసి రండి . తరువాత మీరు ఎక్కడుండాలో చూద్దాం "

బ్లాగరు ముందు నరకం లోకి తొంగి చూసాడు ,

చాలామంది బ్లాగర్లు కంపూటర్ల ముందు కూర్చొని ఉన్నారు .వారికి స్క్రీన్ తప్ప వేరే ఏమీ
కనపడకుండా ,కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి .మద్య లో టపాలు రాయటం ఆపి పారిపోకుండా
కాళ్ళకు సంకెళ్ళు వేసి ఉన్నాయి.రాయటం ఆపితే యమభటులు కొరడా లతో కొట్టి మరీ
రాయిస్తున్నారు .

అది చూసి ,స్వర్గం లోకి అడుగు పెట్టాడు బ్లాగరు.

స్వర్గం లో కూడా బ్లాగర్ల పరిస్థితి అచ్చం నరకంలో మాదిరి గానే ఉంది .

బ్లాగరు అయోమయం లో పడి , పక్కనున్న భటుడిని అడిగాడు ,

"రెండు చోట్లా బ్లాగర్ల పరిస్థితి ఒకేలా ఉందేంటి ? "

"లేదు , తేడా ఉంది " జవాబిచ్చాడు యమ భటుడు .

"ఏమిటది ? "

"స్వర్గం లో రాసిన టపా లన్నీ బ్లాగుల్లో కనిపిస్తాయి .నరకం లో ఎంత రాసినా ,వెంటనే తొలగించ
బడుతుంది "

9 కామెంట్‌లు:

  1. మరి భూలోకం లో పరిస్తితి ఏంటో

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం