*
నగరం లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో కుమార్ హోల్ సేల్ కంపెనీ వారి డీలర్ల సమావేశం
జరుగుతోంది.సేల్స్ మేనేజర్ రాజారావు ,డీలర్లకు అమ్మకాలు ఎలా పెంచాలో అదేపనిగా చెప్పి
విసిగిస్తున్నాడు.
శ్రోతల అదృష్టం కొద్దీ ,రాజా సెల్ ఫోను మోగింది .మొదటి రెండు సార్లు దాని పీక నొక్కి
ఊక దంపుడు కొనసాగించాడు .మూడోసారి విసుగ్గా ఫోను ఎత్తాడు .అవతలివారు చెప్పింది విని
నీరసంగా కూలబడ్డాడు .
డీలర్లు దగ్గరకు చేరి , విషయం అడిగారు .
"నా భార్య కు మూడో కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు " నీరసంగా చెప్పాడు రాజా .
ఆయనకు అందరు డీలర్లు కలిసి , ఒకేసారి కంగ్రాట్స్ చెబుతూ అన్నారు ,
"ఇప్పటికి మీకు అర్ధ మై ఉంటుంది , మేమడిగిన సరుకు కంటే మీరు ఎక్కువ పంపిస్తే ,
మేము పడే బాధ ఏమిటో "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం