*
విశ్వేశ్వరరావు కి ఒక కోర్ట్ కేసుంది . దాని వల్ల కోట్ల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది .
తన లాయరు పానకాల రావు ని అడిగాడు ,
"సార్ ! జడ్జ్ గారు , మనకు అనుకూలం గా తీర్పు చెప్పటానికి , వారికి పువ్వో, పండో
సమర్పించు కుందామని నా ఆలోచన . మీరేమంటారు ? "
"ఆ పని మాత్రం చేయకు . ఆయన యమా స్ట్రిక్ట్ . తనకు లంచం ఇవ్వబోయావని
కేసు పెట్టి జైలు లో తోస్తాడు కూడా "
ఆరు వాయిదాల తరువాత తీర్పు వెలువడింది .విశ్వేశ్వర రావు గెలిచాడు .
లాయర్ గారి నోట్లో , లడ్డూ కుక్కుతూ ,
"మీ ఋణం ఎప్పటికి తీర్చుకోలేనండీ . ఆ రోజు మీరిచ్చిన సలహా వల్ల కేసు అవలీలగా
గెలిచానండీ " ధన్యవాదాలు చెప్పాడు వి .రావు
" నేనేం సలహా ఇచ్చాను నీకు " బుర్ర గోక్కున్నాడు లాయర్
"నేను వారం క్రితం ,అవతలి వాడు పంపినట్లు ఓ వజ్రపుటుంగరం జడ్జ్ గారికి పంపానండి .
దాంతో తీర్పు మనకు అనుకూలంగా ఇచ్చారు ఆయన " ఆనందం గా చెప్పాడు విశ్వేశ్వరుడు .
:))
రిప్లయితొలగించండిsuper :D
రిప్లయితొలగించండి