*
చాలా ఏళ్ళకి , కరుణాకరం ఇంటికి బాబాయి ,పిన్ని వచ్చారు .పిల్లలకి కూడా సెలవలు .బెజవాడ కనకదుర్గమ్మని, మంగళగిరి పానకాల స్వామిని వాళ్ళకి మరునాడు చూపించటానికి ప్లాన్ వేసాడు.
ఖర్చుకి లోభించి,పిల్లల్ని ఇంట్లోనే ఆడుకోమన్నాడు .
మరునాడు ఉదయం ,
బాబాయి ,పిన్ని లతో ,భార్య ,తను బయలుదేరారు .పిల్లలు బిక్కమొహాలేసుకొని నిలబడ్డారు.
మనసు మార్చుకొని,వాళ్ళనీ రమ్మాన్నాడు . అడుగు బయట పెట్టారో లేదో కుండపోతగా వాన .
అది చూసి ఆఖరి పిల్ల సృజన చెప్పింది ,
"మమ్మల్ని తీసుకెళ్లటం లేదని ,మేము దేవుడిని పెద్ద వాన తెప్పించమని ప్రార్ధించాము .ఆయన మా కోరిక తీర్చాడు "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం