బాదం పప్పు

*
కోటేశ్వరరావు చాలా జాగ్రత్తగా బస్ నడుపుతున్నాడు.ఈసారి సంపూర్ణ దక్షిణ దేశ యాత్రలకు
అందరూ వృద్ధులే బయలు దేరారు. డ్రైవింగ్ లో ఏమాత్రం తేడా వచ్చినా , వాళ్ల సణుగుడు
తో చచ్చి పోతున్నాడు .ఇప్పటికి ఇది మూడో రోజు .ఇంకా పన్నెండు రోజులు గడవాలి .

నాలుగు రోడ్ల కూడలి లో మంచి ట్రాఫిక్ లో ఉండగా , ఎవరో వెనకనుండీ భుజం తట్టారు .
చూస్తే ఓ 80 ఏళ్ల ముసలావిడ,అతని చేతిలో బాదం పప్పులు పెట్టింది.బానే ఉంది అనుకుంటూ
ఒక్కొక్కటీ పంటి క్రింద నములుతూ బస్ నడుపుతున్నాడు డ్రైవర్ .

ఓ పావు గంట గడిచేసరికి,మళ్ళీ ఎవరో భుజం తట్టారు ,వెనక్కి తిరిగితే చేతినిండా బాదం పప్పు
పోశాడు ఓ డెబ్బై ఏళ్ల పెద్దాయన . ఇవాళ మన అదృష్టం బాగుందని , పప్పులు నములుతూ
బండి తోలాడు .

అలా ఆ రోజల్లా గడిచింది .దాదాపు ఓ ఇరవై సార్లు బాదం పప్పులు తిన్నాడతను.

రాత్రి బస దగ్గర ప్రయాణికులను ఆసక్తిగా అడిగాడు ,

" మీరు రోజల్లా నాకు బాదం పప్పులు పిలిచి మరీ పెట్టారు, మీరే తినచ్చు గదా ? "

పెద్దలు అందరూ ఒకే గొంతుతో చెప్పారు బృందగానం లా ,


"మాకు చాక్లెట్లు అంటే ఇష్టం,కానీ వాటిలోని బాదం పప్పు నమలటానికి మాకు పళ్ళు లేవు "

5 కామెంట్‌లు:

  1. హమ్మయ్య... ఇన్నాళ్ళకు దొరికారు. ఈ జోకు నాకు తెలుసు. మీ బ్లాగ్ ఎప్పుడు చూసినా నేను వినని జోకులిన్ని ఉన్నాయా అని నోరెళ్ళబెట్టేవాడిని.

    రిప్లయితొలగించండి
  2. జింగీ ,

    ఏమో బాబూ , జోకనుకునే పోస్ట్ చేసాను


    బృహస్పతి గారు ,

    ఈ జోకు నాకూ తెలుసండీ,అందుకే రాయగలిగాను

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం