పాపం రవి

*
బుజ్జి పరిగెత్తుకుంటూ,పక్కింటి లోకి దూసుకెళ్ళింది."హరీ ,హరీ , ఎక్కడున్నావు ? "అంటూ
అన్ని గదుల్లోకి కలయతిరిగింది .ఇంతలో హరి ఇంట్లోకి వస్తూ కనిపించాడు .

"ఎక్కడికి వెళ్ళావ్ " అడిగింది బుజ్జి

"మీ ఇంటికే " చెప్పాడు హరి

" సరే , నీకు తెలుసా , మీ క్లాసు లో ఎత్తుగా ఉంటాడే , రవి గాడు పాపం వికలాంగుడు
అయి పోయాడు "

" వాడికి ఏం జరిగింది ? " అడిగాడు హరి ఆతృతగా

" ఏమో నాకు తెలీదు ,ఇందాక మేము మా ఊరినుండీ బస్సు లో వస్తుంటే ,వాడు వికలాంగుల
సీట్ లో కూర్చొని కనబడ్డాడు .పాపం పలకరిద్దామంటే బస్సు బాగా రద్దీ గా ఉంది "
చెప్పింది ఆరేళ్ల బుజ్జి .

2 కామెంట్‌లు:

  1. మొన్న తిరుమల దర్శనానికి D.S. వికలాంగుడు అయినట్లు అన్నమాట!!. D.S. కు ఏ పార్ట్ లు పనిచేయటం లేదో మన మందు వ్యాపారి మరియు T.T.D. chairman కు మాత్రమే తెలుసు మరి.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం