పంపకం

*
నగరం లో ఒక గొప్ప ధనవంతుడు సేట్ అన్సారీ లాల్ హటాత్తుగా చనిపోయాడు.చివరి
కార్యక్రమాలు పూర్తి అయినాయి .

తరువాత ఆయనపిల్లలు మహేష్ , రజనీష్ ఇద్దరూ ఎవరికి నచ్చింది వారు తమదే అని
ప్రకటించుకోసాగారు .అది కొట్లాట దాకా వెళ్ళింది .

హత్య జరిగిన తరువాతే లాయర్ అవసరం అని నమ్మిన వాళ్ల బాబాయి, వాళ్ల గొడవల్ని
చూస్తూ ఉండిపోయాడు .

వాళ్లకి విసుగొచ్చి , చేవ చచ్చి చివరకు తమ లాయర్ బాబాయి దగ్గరికి చేరి పరిష్కారం
చుపించమన్నారు . ఆయన "నేను చెప్పింది మీరు వింటానంటే చెబుతాను "అన్నాడు .

మహేష్ ,రజనీష్ ఇద్దరూ అంగీకరించారు . ఆయన ఆలోచించి చెప్పారు ,

"మహేష్ ఆస్తిని వాటాలు వేసే పని నీది . మొదటగా తనకు వాటా కావాలో కోరుకునే
హక్కు రజనీష్ ది "

2 కామెంట్‌లు:

  1. హబ్బే ఆయనేం లాయరండీ? నిజమైన లాయరు వాళ్ళిద్దరూ ఆస్తి మొత్తం లాయరు ఫీజుల్లో చెల్లించుకునేదాకా కొట్టుకునేట్టూ సలహా ఇచ్చుండేవాడు! :)

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం