*
" తెలుగు నాడి మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ లిమిటెడ్ " వారి రిసెప్షన్ లో,వచ్చే వందలాది
ఫోన్ కాల్స్ కు ఓపిగ్గా సమాధానాలు ఇస్తూ బాగా బిజీగా ఉంది కాళిక.
వచ్చిన కొద్ది ఖాళీ లో టీ తాగుతుండగా,
ఓ ఫోన్ మోగింది .కాళిక సౌమ్యం గా ఫోన్ తీసి హలో అంది .అవతలివైపు గొంతు కొంచం
ఆదుర్దాగా పలికింది
" అమ్మా ! రవీంద్ర ఎలా ఉన్నాడో కాస్త చెప్పగలరా ? "
" మీరు ముందుగా వారి రూం నెంబర్ చెప్పండి "
" రూం నంబర్ 113 "
" ఒక్క రెండు నిమిషాలు లైన్లో ఉండండి, కనుక్కొని చెబుతాను "
ఆ రూం లోని పేషెంట్ ని చూసే నర్స్ నుండీ వివరాలు తీసుకొని కాళిక ,
"ప్రస్తుతం రవీంద్ర గారు ఆరోగ్యం గానే ఉన్నారు ,వారి పరిస్థితి బాగుంది , రేపు వారిని
ఇంటికి పంపుతామని డాక్టర్ చెప్పారు "
" చాలా సంతోషమమ్మా ,ఉంటాను " ఫోను పెట్టబోయారు అవతలి మనిషి
కాళిక అడిగింది ఆసక్తిగా ,
" మీరు రవీంద్ర గారికి ఏమౌతారు ?, నాన్న గారా లేక తాత గారా ? "
" రవీంద్ర ని నేనేనమ్మా,నా ఆరోగ్యం గురించి ఏమడిగినా ఇక్కడ ఎవరూ ఏమీ చెప్పి చావట్లేదు "
excellent గా చెప్పారు. నిజం కూడా . ఫోన్ కు ఇచ్చినంత విలువ మనుషులకు ఇవ్వడం లేదు అనే విషయాన్ని భలే చెప్పారు.
రిప్లయితొలగించండిlol :) హాస్యమైనా నిజంగా నిజం చెప్పారు. ప్రస్తుతం కార్పోరేట్ హాస్పటల్స్ ఇలానే ఉన్నాయి.
రిప్లయితొలగించండిplease visit http://dhoommachara.blogspot.com for my new post
రిప్లయితొలగించండిgood one here....
రిప్లయితొలగించండి